గీత గోవిధం , టాక్సీవాలా తో వరుసగా బ్లాక్ బాస్టర్  విజయాలు అందుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' తో షాక్ తిన్నాడు.  ఇటీవల విడుదలైన ఈ చిత్రం యావరేజ్ రివ్యూస్ ను రాబట్టుకుంది అయితే మౌత్ టాక్ పూర్తిగా నెగిటివ్ గా రావడం తో బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా  బోల్తాపడింది.  మొదటి మూడు రోజులు 18కోట్ల షేర్ ను రాబట్టిన ఈచిత్రం ఆ తరువాత పూర్తిగా తేలిపోయింది.ఈచిత్రం యొక్క తెలుగు వెర్షన్ ఫుల్ రన్ లో  20 కోట్ల షేర్ రాబట్టింది.  అయితే  నైజాం అలాగే ఓవర్సీస్ లో ఈ చిత్రం మంచి వసూళ్లను  సాదించగలిగింది.  కాగా  ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ భాషల్లో కూడా విడుదలచేయగా అక్కడ కోటి 50లక్షల షేర్ ను మాత్రమే రాబట్టి షాక్ ఇచ్చింది. 


ఇక ఫుల్ రన్  అన్ని వెర్షన్లలో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం  21.50 కోట్ల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసి డిజాస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది.  అయితే  ఈ సినిమా 34కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం తో బయ్యర్లకు  నష్టాలు తప్పలేదు. ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ నేపథ్యంలో నూతన దర్శకుడు  భరత్ కమ్మ తెరకెక్కించిన  ఈచిత్రానికి  కన్నడ  సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్  సంగీతం అందించగా   మైత్రి మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగానిర్మించాయి.  కాగా గీత గోవిందం తరువాత  కన్నడ బ్యూటీ రష్మిక  మందన్న  రెండో సారి ఈ చిత్రం తో విజయ్ కు జోడిగా నటించింది.  ఇక ఈచిత్రం యొక్క  హిందీ రీమేక్ హక్కులను  ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్  సొంతం చేసుకున్నాడు.  త్వరలోనే ఈ సినిమాను  అక్కడ  రీమేక్ చేయనున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: