కెరటం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. కెరటం సినిమా ఫ్లాప్ అయినప్పటికీ రకుల్ నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ హిట్ కావటంతో రకుల్ కు టాలీవుడ్లో గుర్తింపు వచ్చింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తరువాత రకుల్ నటించిన లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో సినిమాలు యావరేజ్ ఫలితాన్ని అందుకున్నాయి. రవితేజతో రకుల్ నటించిన కిక్2 సినిమా నుండి రకుల్ కు స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చాయి. 
 
రామ్ చరణ్ బ్రూస్ లీ, ఎన్టీయార్ నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్ సరైనోడు సినిమాలలో ఛాన్సులు రావటంతో స్టార్ హీరోయిన్ గా మారింది రకుల్. ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక సినిమాలు రకుల్ కు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. కానీ మహేష్ బాబుతో  నటించిన స్పైడర్ సినిమా డిజాస్టర్ కావటంతో రకుల్ ప్రీత్ సింగ్ కు తెలుగులో అవకాశాలు తగ్గాయి. 
 
ఇదే సమయంలో రష్మిక మందన్నా, పూజా హెగ్డే, సాయీ పల్లవి లాంటి హీరోయిన్స్ నటించిన సినిమాలు హిట్ అవ్వటంతో రకుల్ హవా టాలీవుడ్లో తగ్గింది. తెలుగులో అవకాశాలు తగ్గటంతో రకుల్ తమిళ, హిందీ భాషల్లో ఎక్కువగా నటించింది. ఈ సంవత్సరం సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కథానాయకుడు సినిమాలో స్పెషల్ పాత్రలో నటించినా ఆ సినిమా డిజాస్టర్ కావటంతో రకుల్ కెరీర్ కు ఏ విధంగా ఉపయోగపడలేదు. 
 
రెండు రోజుల క్రితం అక్కినేని నాగార్జునకు జోడీగా రకుల్ నటించిన మన్మథుడు2 సినిమా విడుదలైంది. ఈ సినిమాకు టాక్ అంత అనుకూలంగా లేకపోవటంతో రకుల్ కు ఇక ముందు టాలీవుడ్లో సినిమా ఛాన్సులు రావటం కష్టమేనని తెలుస్తోంది. మరి వరుస ఫ్లాపుల్లో ఉన్న రకుల్ కు తెలుగులో ఛాన్సులు ఎవరిస్తారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: