సుమారు 14 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాల బాట పట్టిన విజయ్ శాంతి తిరిగి యూటర్న్ తీసుకుని మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ స్పాట్ కు ఈ మధ్యనే మేకప్ తో వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో విజయ్ శాంతి లుక్ చాల డిఫరెంట్ గా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి చెందిన ఒక ప్రముఖ లా కాలేజీలో విజయశాంతి పై దర్శకుడు అనీల్ రావిపూడి కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నట్లు సమాచారం. కాలేజీ ప్రొఫిసర్ పాత్రలో ఈమూవీలో నటిస్తున్న విజయశాంతి గ్రే హెయిర్ తో పెద్ద కళ్ళజోడుతో చాల డిఫరెంట్ గా కనిపించబోతోందని టాక్. ఈ పాత్రలో నటిస్తున్న విజయశాంతి కోసం కొన్ని కాటన్ చీరలను ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. 

అభ్యుదయ భావాలు ఉన్న ప్రొఫిసర్ పాత్రలో నటిస్తున్న విజయశాంతిని కాలేజీలో మహేష్ కలిసే కొన్ని కీలక సన్నివేశాలను ఈ రోజు నుంచి చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో విజయశాంతి కెరియర్ ను ఒక మలుపు తిప్పిన ‘ప్రతిఘటన’ మూవీలో విజయశాంతి కాలేజీ లెక్చరర్ పాత్ర పోషించింది. తిరిగి కొన్ని సంవత్సరాల తరువాత విజయశాంతి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమాలో కూడ ప్రొఫిసర్ పాత్ర పోషించడం యాదృశ్చికం అనుకోవాలి. 

మహేష్ పాత్రతో సరిసమానంగా విజయశాంతి పాత్రను ఎలివేట్ చేసిన నేపధ్యంలో ఈ మూవీతో విజయశాంతి హవా మళ్ళీ ప్రారంభం అయి కొంతకాలం కొనసాగే ఆస్కారం ఉంది. ఇప్పటికే కాశ్మీర్ షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ షెడ్యూల్ ను పరుగులు తీయిస్తున్న నేపధ్యంలో ఈ మూవీ మేకింగ్ స్పీడ్ చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పడుతున్నాయి. సంక్రాంతిని టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈ మూవీకి కనీవినీ ఎరుగని రీతిలో బయ్యర్ల నుండి ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం..   
 



మరింత సమాచారం తెలుసుకోండి: