ప్రభాస్, శ్రధ్ధాకపూర్ జంటగా నటిస్తున్న సాహో సినిమా ఈ నెల 30వ తేదీన కాబోతుంది. బాహుబలి, బాహుబలి2 సినిమాల తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావటం, పాన్ ఇండియా అప్పీల్ ఉండటంతో సాహో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. కానీ కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజీత్ ఈ సినిమా ఎలా తీసి ఉంటాడా అనే అనుమానాలైతే ప్రేక్షకుల్లో ఇంతకాలం ఉన్నాయి. 300 కోట్ల బడ్జెట్ సినిమాను సుజీత్ హ్యాండిల్ చేయగలడా అనే ప్రశ్నలు కూడా వినిపించాయి. 
 
కానీ సాహో టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఈ సినిమాపై ఇలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోవలసిన అవసరం లేదనిపించించేలా ఉంది టీజర్. సాహో ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడే సాహో సినిమాపై ఇన్ని రోజులపాటు ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. సాహో ట్రైలర్ ఒక హాలీవుడ్ సినిమా ట్రైలర్ లా, విజువుల్ వండర్ గా తీర్చిదిద్దాడు సుజీత్. 
 
మగధీర, ఈగ, బాహుబలి, బాహుబలి2 సినిమాలు టాలీవుడ్ సినిమాల ఖ్యాతిని భారతదేశమంతటా తెలిసేలా చేసాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా కూడా తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలు ఎన్నో రెట్లు పెంచేలా ఉంది. నిర్మాతలు ఈ సినిమా కోసం పెట్టిన బడ్జెట్, ప్రభాస్ ఈ సినిమా కోసం పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లోను కనపడుతోంది. నిజానికి ప్రభాస్ బాహుబలి సినిమాలో నటించకముందే సుజీత్ ప్రభాస్ కు ఈ కథ చెప్పాడు.కథ నచ్చటంతో ప్రభాస్ బాహుబలి పూర్తి అయిన వెంటనే సుజీత్ కు అవకాశమిచ్చాడు 
 
బాహుబలి, బాహుబలి2 ఇండస్ట్రీ హిట్స్ అవ్వటంతో ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే భారీ బడ్జెట్ తో నిర్మించింది యువి క్రియేషన్స్. ఈ సినిమాలోని యాక్షన్ సీన్ల కోసమే ప్రభాస్ ఒక సంవత్సరం పాటు కష్టపడ్డాడు. ట్రైలర్ అంచనాలు పెంచటంతో సినిమా మొదటి రోజే భారీ స్థాయిలో వసూళ్ళు రాబట్టే అవకాశం ఉంది. మరి సాహో సినిమా విడుదలయ్యాక ఏ స్థాయిలో రికార్డులు సాధించి చరిత్ర సృష్టిస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: