‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ఇంకా చాల పెండింగ్ లో నడుస్తోంది. ఈ మూవీ విడుదల వచ్చే ఏడాది జూలైలో మాత్రమే. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రమోషన్ ను వచ్చే ఏడాది జనవరి నుండి మాత్రమే ప్రారంభించాలని రాజమౌళి ఆలోచనలు చేసాడు. అయితే ఇప్పుడు వ్యూహాలు మారిపోతున్నట్లు తెలుస్తోంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఎల్లుండి ఆగష్టు 15 భారత స్వాతంత్రదినోత్స్వం సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదల కాబోతోంది. కొమరం భీమ్ స్పూర్తిగా మలచబడ్డ జూనియర్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇంత ముందుగా విడుదల చేయడం వెనుక ఒక బిజినెస్ వ్యూహం ఉంది అని అంటున్నారు. 

‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రాజెక్ట్ గురించి ఆ మూవీ బడ్జెట్ గురించి రాజమౌళి ఓపెన్ గా ఎన్ని లీకులు ఇచ్చినా ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ ఆఫర్స్ రాజమౌళి ఊహించిన స్థాయిలో లేవు అన్న ప్రచారం జరుగుతోంది. దీనితో ఈ మూవీకి సంబంధించిన బయ్యర్స్ లో పోటీ ఏర్పరిచి ఈ మూవీ బిజినెస్ ను తార స్థాయికి తీసుకు వెళ్ళాలి అన్న ఆలోచనలతో రాజమౌళి ఎల్లుండి జూనియర్ లుక్ ను బయటపెడుతున్నట్లు టాక్. 

దీనికితోడు ఈ మధ్య కాలంలో ‘ఆర్ ఆర్ ఆర్’ పై చాల నెగిటివ్ వార్తలు హడావిడి చేసిన పరిస్థితులలో వాటికి విరుగుడుగా రాజమౌళి జూనియర్ లుక్ ను మార్కెట్ లోకి దింపుతున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. దీనితో రాజమౌళి సరికొత్త వ్యూహం ‘ఆర్ ఆర్ ఆర్’ బిజినెస్ కు ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి. కారణాలు ఏమైనా జూనియర్ లుక్ బయటకు వస్తోంది కాబట్టి రాబోతున్న స్వాతంత్రదినోత్స్వం జూనియర్ అభిమానులకు ఊహించని పెద్ద పండుగగా మారబోతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: