హలొ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ కుట్టి కల్యాణి ప్రియదర్శిని. మలయాళ దర్శకుడు ప్రియదర్సన్-లిజీ గారాల పట్టీ అయిన ఈ అమ్మడు తెలుగులో మంచి గుర్తింపే తెచుకుంటోంది. ఇటీవలే చిత్రలహరితో హిట్ సాధించిన ఈ అమ్మడు తాజాగా శర్వానంద్ తో రణరంగంలో నటించింది. ఈ నెల 15న ఈ సినిమా విడుదల కానుంది. గీత అనే పాత్రను ఈ సినిమాలో చేసింది కల్యాణీ.

 

 

 

పాత్ర నచ్చితే సినిమాలో నటిస్తానని క్యారెక్టర్ చిన్నదా.. పెద్దదా అని చూడనంటోంది. గ్యాంగ్ స్టర్ సినిమాలంటే తనకు చిన్నప్పటినుంచీ ఆసక్తి అని చాలా సినిమాలు చూశానని చెప్తోంది. సుధీర్ వర్మ కథ చెప్పిన విధానం బాగుందని ఓ గ్యాంగ్ స్టర్ 20 ఏళ్ల జీవితాన్ని స్పృశిస్తూ కథ నడిపే విధానం బాగుందని అంటోంది. సినిమా అంతా శర్వా, గీత అనే క్యారెక్టర్ల చుట్టూనే తిరుగుతూ ఆసక్తిగా ఉంటుందని చెప్తోంది. తన ఇష్టాల గురించి చెప్తూ.. గన్ ఫైరింగ్ అంటే తనకున్న ఇష్టాన్ని ఈ సినిమా ద్వారా తీరిందని ఆంటోంది. చిన్నప్పుడు గన్ ఫైరింగ్ నేర్పించమని తన తండ్రిని ఆడిగానని  జ్ఞాపకాలను నెమరవేసుకుంది. నాన్న లా దర్శకత్వం వహించాలనే కోరిక ఉందని, కొంత టైమ్ గ్యాప్ తర్వాత ఖచ్చితంగా మెగా ఫోన్ చేపట్టి దర్శకత్వం వహిస్తానంటోంది ఈ భామ.

 

 

 

ప్రస్తుతం మలయాళం లో తన తండ్రి దర్శకత్వంలో మరక్కర్ అనే సినిమాలో నటిస్తున్నట్టు తెలిపింది. చిన్న పాత్రే అయినా ప్రాధాన్యమున్న పాత్ర అని, తండ్రి దర్శకత్వంలో నటించడం కొంత ఒత్తిడిగానే ఉందని అంటోంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోందని ఆ సినిమా కూడా తనకు మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుందని  అంటోంది.  తెలుగు సినిమా వాతావరణం తనకు బాగా నచ్చిందని చెప్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: