రెజీనా టాలీవుడ్ కు పరిచయమైనా కొత్తల్లో మంచి నటిగా పేరు తెచ్చుకుంది.  తప్పకుండా స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకుంటుంది అనుకున్నారు.  కానీ, ఆమె మెగా కాంపౌండ్ సినిమాలు ఎక్కువ చేయడంతో అక్కడికే పరిమితం అయ్యింది.  బయట సినిమా ఆఫర్లు తక్కువగా వచ్చాయి. ఆ తరువాత యువ హీరోయిన్ల తాకిడి ఎక్కువ కావడంతో రెజీనాకు ఆఫర్లు తగ్గిపోయాయి.  


ఇటీవలే ఈ అమందు 7 సినిమా చేసింది.  థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన సినిమా అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది.  సినిమా ఫెయిల్ కావడంతో ప్రస్తుతం ఆమె చేతిలో ఎవరు సినిమా మాత్రమే ఉన్నది.  ఈ మూవీ ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతుండటంతో ప్రమోషన్స్ తో బిజీ అయ్యింది ఈ భామ.  


రెజీనా హిందీలో కూడా ఓ సినిమా చేసింది.  ఏక్ లడ్కితో దేఖా హైతో ఐసా లాగా అనే సినిమా.  సోనమ్ కపూర్ మెయిన్ హీరోయిన్.  రెజీనా ఇందులో లెబ్సియన్ రోల్ చేసింది.  సోనమ్.. రెజినాల మధ్య రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి.  మొదట దర్శకురాలు ఈ సినిమా గురించి ఫోన్ చేసి కథ చెప్పి చేయాలనీ కోరిందట.  దానికి కొంత సమయం తీసుకున్నాక ఫ్రెండ్స్ ను అడిగానని, కానీ వాళ్లంతా ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదని చెప్పింది.  


అందరు కాదంటున్నారు అంటే ఆ పాత్ర చాలెంజింగ్ తో కూడుకొని ఉంటుంది కాబట్టి తప్పకుండా చేయాలని చెప్పి అనుకుందట.  అనుకున్నట్టుగానే రెజీనా  సినిమా చేసింది.  మంచి పేరు వచ్చింది.  బాలీవుడ్ లో సినిమా హిట్టయినా అక్కడ కూడా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం తెలుగులో ఎవరు సినిమా బిజీలో ఉన్నది రెజీనా.  


ఈ సినిమా ఫలితం మీదనే ఈ అమ్మడి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనడంలో సందేహం అవసరం లేదు.  ఒకవేళ సినిమా హిట్టయితే.. రెజినాకు మరలా ఏదోలా అవకాశాలు వస్తాయి.  ఫలితం రివర్స్ అయితే, తట్టాబుట్టా సర్దుకోవడం బెటర్.  


మరింత సమాచారం తెలుసుకోండి: