యాంగ్రీ హీరో రాజశేఖర్ ‘మా’ సంస్థ విషయాల పై తీవ్ర అసహనానికి లోనవుతూ ‘మా’ సంస్థకు సంబంధించిన కీలక సమస్యల పై అధ్యక్షుడు నరేష్ ను పక్కకు పెట్టి రాజశేఖర్ స్వయంగా రంగంలోకి దిగి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటూ ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో రాజశేఖర్ తీసుకుంటున్న నిర్ణయాలు మళ్ళీ ‘మా’ సంస్థలో విభేదాలను బయటపెట్టింది అంటూ ఆ కథనంలో పేర్కొనబడింది.

 

కొద్దిరోజుల క్రితం మా సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు రాజశేఖర్ ఇంటిలో సమావేశమై ఈ సంస్థకు సంబంధించిన పెండింగ్ సమస్యల గురించి ఒక నిర్ణయం తీసుకోవాలని ఒక సమావేశం నిర్వహించి ఆ సమావేశానికి ‘మా’ సంస్థ అధ్యక్షుడు నరేశ్ ను ఆహ్వానించినా అతడు ఆ సమావేశానికి రాకపోవడంతో రాజశేఖర్ తీవ్ర అసహనానికి లోనైనట్లు టాక్. దీనితో మా సంస్థ వ్యవహారాలూ అన్నింటిని తానే చూస్తానని చెప్పడమే కాకుండా ఈ విషయమై ప్రస్తుతం రాజశేఖర్ అనుసరిస్తున్న స్పీడ్ చూస్తుంటే మళ్ళీ మా వ్యవహారాలూ వివాదాలుగా మారే ఆస్కారం ఉంది అంటూ ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది.

 

‘మా’ సంస్థకు సంబంధించిన కొన్ని పెండింగ్ సమస్యలు గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవాలని మా కమిటీ భావిస్తున్నా ఆ విషయాల పై నరేశ్ ఆసక్తి కనపరచక పోవడం రాజశేఖర్ కు అదేవిధంగా మా కమిటీకి అసహనం కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇద్దరు ముఖ్యమంత్రులను కలిసి మా సంస్థ వ్యవహారాలను చక్కపెట్టవలసిన అవసరం ఉన్న నేపధ్యంలో ఈ కీలక అంశాల పట్ల కూడ నరేశ్ ఉదాసీనంగా ప్రవర్తించడం మా కమిటీకి తీవ్ర అసంతృప్తిగా మారింది అని టాక్.

 

అయితే ఈ కీలక విషయాలను లెక్క చేయకుండా నరేశ్ తన సొంత కెరియర్ గురించి సినిమాల గురించి ఆలోచనలు చేస్తూ మా సంస్థను పక్కకు పెట్టేసాడు అన్న భావంతో మా కమిటీలోని చాలామంది రాజశేఖర్ ను ఈ విషయంలో నాయకత్వ బాధ్యత చేపట్టవలసిందిగా కోరుతున్నట్లు సమాచారం. ఇన్ని పరిణామాలు జరుగుతున్నా నరేశ్ ఈ విషయాల పై వ్యూహాత్మక  మౌనం పాటిస్తూ అనసరిస్తున్న తీరు దేనికి సంకేతం అంటూ ఆ పత్రిక తన కథనంలో అనేక ఆసక్తికర విషయాలను బయట పెట్టింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: