‘సాహో’ విడుదల గురించి ప్రభాస్ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ‘సాహో’ విడుదల కాకుండానే ‘సాహో’ ని దెబ్బకొట్టాలని ఇండస్ట్రీలో కొన్ని వర్గాలు అప్పుడే తమ ప్రయత్నాలు మొదలు పెట్టేసారు. ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ‘సాహో’ రషస్ ను ఈ మధ్య చూశాడని ఈసినిమా ఎడిటింగ్ కు సంబంధించి కొన్ని సూచనలు ఇవ్వడమే కాకుండా ఈ మూవీ నిడివిని తగ్గించమని దర్శకుడు సూచించాడు అంటూ గాసిప్ లు హడావిడి చేస్తున్నాయి. 

దీనితో ఎలర్ట్ అయిన సుజిత్ రాజమౌళి సలహాతో ఈ మూవీలో అనవసరంగా కనిపిస్తున్న 18 నిముషాల సీన్స్ ను కట్ చేసాడు అంటూ ప్రచారం కూడ మొదలైంది. ఈ గాసిప్పులు ఇలా గుప్పునడంతో ఈ విషయంలో యదార్దాలు ఎన్ని అంటూ ‘సాహో’ నిర్మాతల నుండి కొందరు  యదార్దాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే వారి నుండి షాకింగ్ సమాధానం వచ్చినట్లు టాక్. 

రాజమౌళి ఇంతకు వచ్చి ‘సాహో’ కి సంబంధించిన ఒక్క సీన్ కూడ చూడలేదని అదేవిధంగా తాము చూడమని కూడ అభ్యర్ధించలేదని అలాంటి పరిస్థుతులలో రాజమౌళి ‘సాహో’ నిడివి పై ఎలా కామెంట్ చేస్తాడు అంటూ స్పందిస్తున్నట్లు టాక్. అంతేకాదు ‘సాహో’ ఫైనల్ కాపీ ఇంకా రెడీ కాలేదనీ గ్రాఫిక్ వర్క్స్ చివరిదశలో ఉన్న ఈమూవీని రాజమౌళి చూసే అవకాశం ఎక్కడ ఉంది అంటూ ‘సాహో’ నిర్మాతలు ఎదురు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. 

దీనితో ఈ విషయమై ఇండస్ట్రీ వర్గాలు మరొక విధంగా కామెంట్స్ చేస్తున్నాయి. ‘సాహో’ విడుదల కాకుండానే ఈమూవీ పై ఇలాంటి నెగిటివ్ రూమర్స్ ప్రచారంలోకి వస్తున్న పరిస్థితులలో ‘సాహో’ టాక్ లో చిన్న తేడా వచ్చినా దానిని హైలెట్ చేస్తూ ఇంకా ఎంత రచ్చ జరుగుతుందో అంటూ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా 'సాహో’ హిట్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారో ఆ మూవీ ఫెయిల్ అవ్వాలని కోరుకునే వారి సంఖ్య కూడ చాల ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: