భారతదేశం అఖండ భారతావానిగా మారి నేటికి  72 ఏళ్ళు పూర్తి అయ్యాయి. ఎర్రకోట నుండి దేశంలోని మారుమూల గ్రామాల వరకు ఎక్కడ చూసినా జాతీయ పతాకాలే ఈరోజు కనిపిస్తాయి . 137 కోట్ల భారతీయుల ఆత్మస్థైర్యానికి చిహ్నంగా కనిపించే త్రివర్ణ పతాకం చూసిన ప్రతి వ్యక్తికి ఈరోజు ఒక అనిర్విచనీయమైన అనుభూతి కలుగుతుంది.   స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత రెండు తరాలు గతించిపోయినా ఇంకా మనం ఆహారం పోషణ ఆరోగ్యం విద్య వంటి ప్రాధమిక అవసరాల విషయంలో ఇప్పటికీ చాలా వెనకపడి ఉండటం కలవరపాటు కలిగించే  విషయం.

స్వాంతంత్ర్యం అంటే మన జీవితాన్ని మనమే స్వేచ్ఛగా మలచుకుని ఒక మంచి మార్గంలో పెట్టుకుని పరిపూర్ణమైన పౌరుడిగా ఎదగడానికి ప్రయత్నిండం. దేశానికి స్వాతంత్ర్యం సాధించుకున్న తరువాత ఎన్నో విషయాలలో ముందు అడుగు వేసినా మనం దేశానికి అవసరమైన గొప్ప నాయకులను మాత్రం తయారు చేసుకోలేకపోయాంఅన్నది వాస్తవం. ప్రస్తుతం మనదేశం  కొన్ని రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నప్పటికీ జనాభాలో ఇప్పటికీ 30 శాతం దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. 

దేశ జనభాలో 60 శాతంకు పైగా ఉన్న యువశక్తి సరైన దిశా నిర్దేశంలేక అవకాశాలను అంది పుచ్చుకోలేక పోతున్నారు. చందయాన్ విషయంలో ఘన విజయం సాధించిన మన పురోగతి సామాన్యుడికి అవసరమైన కనీస అవసరాలు కలగచేయ లేకపోతోంది స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా కులం భారతదేశ  రాజకీయాలను శాసిస్తూనే ఉంది. ప్రజలకు దక్కవలసిన కనీస అవసరాలు రాజకీయ పార్టీల ఎన్నికల హమీలుగా మారిపోవడంతో ఏ రాజకీయ పార్టీ ఎక్కువగా వాగ్దానాలు చేస్తూ ప్రజలను నమ్మించ గలుగుతుందో ఆపార్టీకి ఓట్లు వేసే యంత్రాలు లా ప్రజలు మారిపోయారు. 

శాస్త్ర సాంకేతిక విధ్యలలో సాధిస్తున్న పురోగతి సామాన్యుడి జీవన ప్రమాణాల విషయంలో కనిపించడంలేదు. ఇలాంటి అనిశ్చితి కొనసాగుతూ ఉన్నా జాతీయ పతాకాన్ని చూస్తే చాలు ఈరోజు ప్రతి భారతీయుడి కళ్ళల్లో ఏదో ఆనందం కనిపిస్తుంది. ఆ ఆనందమే దేశభక్తి. స్వాతంత్ర సమరంలో ప్రాణాలు పోగొట్టుకున్న మన స్వాతంత్ర సమరోయోధులను స్మరించుకుంటూ ఉదయించిన ఈనాటి స్వాతంత్ర ఉషోదయం భారతీయులు అందరికీ చైతన్య స్పూర్తిని కలిగించాలని కోరుకుంటూ ఇండియన్ హెరాల్డ్  తరుఫున అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: