ప్రభాస్ సాహో  సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.  ఆగష్టు 30 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  దీనికి సంబంధించిన ట్రైలర్ ను ఇటీవలే ముంబైలో రిలీజ్ చేశారు.  బాలీవుడ్ లో టి సీరీస్ సంస్థ ఈ సినిమాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.  భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు.  



ట్రైలర్ రిలీజ్ తరువాత హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.  ఈ మీటింగ్ లో ప్రభాస్ అనేక విషయాలు చెప్పారు.  అయితే, హైదరాబాద్ సాహో కు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు.  ఈనెల 18 వ తేదీన రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ఈ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.  


తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా లక్ష మంది వరకు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వేడుకకు హాజరు కాబోతున్నారని వినికిడి.  ఈనెల 18 జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా యూనిట్ అంతా పాల్గొనబోతున్నది.  హైదరాబాద్ వేడుక తరువాత దేశంలో వివిధ నగరాల్లో ఈ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నది. బెంగళూరు, చెన్నై, కోచి, ఢిల్లీ, దుబాయ్ లో ఇంకా వేడుకలు నిర్వహించాల్సి ఉన్నది.  



సమయం తక్కువగా ఉండటంతో వీలైనంత త్వరగా వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తున్నది సాహో యూనిట్.  పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఇండియాస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ గా పేరు తెచ్చుకున్నది.  విజువల్ పరంగా గ్రాండ్ గా సినిమా ఉండబోతున్నది.  అయితే, సాంగ్స్ సినిమాకు మైనస్ అయ్యాయి.  రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు.  ఇదే ఈ సినిమాకు మైనస్ అయ్యింది.  హిందీ పాటలను తెలుగులో డబ్ చేసినట్టుగా ఉన్నాయి.  మరో పాటను రిలీజ్ చేయాల్సి ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: