నోరా ఫతేహి గురించి చాలామందికి తెలియదు. ఆమె హీరోయిన్ కాదుగాని, మంచి డ్యాన్సర్.  బాహుబలి ఫస్ట్ పార్ట్ తరువాత ఆమె పేరు వెలుగులోకి వచ్చింది.  బాహుబలికి ముందు కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు.  ఈ సినిమా తరువాత ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి.  ప్రస్తుతం ఈ అమందు బట్లాహౌస్ సినిమాలో సాంగ్ చేసింది.  ఈ సాంగ్ మంచి హిట్ కొట్టింది.  



ఈ సినిమా ఈరోజు రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.  బాలీవుడ్ లోకి అడుగు పుట్టకముందు పాపం నోరాను అనేకమంది మోసం చేశారట.  ఇండో కెనెడియన్ అయినా నోరాకు  ఆఫర్లు ఇస్తామని చెప్పి కొంతమంది ఇండియాకు పిలిపించారు.  కొన్ని కారణాల వలన ఆమెకు అవకాశాలు దక్కలేదు.  అంతేకాదు షూటింగ్ లతో వచ్చిన 20 లక్షల రూపాయలను కూడా పోగొట్టుకోవాల్సి వచ్చిందని ఇటీవలే ఈ అమ్మడు చెప్పింది. 


కొంతమందితో కలిసి ముంబైలో ఓ అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడిందట.  అంతేకాదు, సినిమా ఆడిషన్స్ కు వెళ్ళినపుడు హిందీ రాకపోవడం ఆమెకు మైనస్ అయ్యింది.  ఒక్కొక్కటిగా అవకాశాలు దక్కించుకొని ఇప్పుడు ఇండస్ట్రీలో స్థిరపడింది. స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసే అవకాశాలు వస్తున్నాయి.  తాను చేసిన సాంగ్స్ హిట్ అవుతుండటం ఆమెకు కలిసి వస్తున్న అంశం గా మారింది.  



ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో దూసుకుపోతున్నది.  ఇప్పటికే ఈ విషయంలో నోరా ఫతేహి ముందు వరసలో ఉండటం విశేషం.  కష్టాన్ని నమ్ముకుంటే ఏదైనా సాధ్యం అవుతుందని, కష్టపడందే ఏది సాధ్యం కాదని నోరా చెప్తోంది.  బట్లా హౌస్ సినిమాలోని సాకి సాకి సాంగ్ సూపర్ హిట్ కావడంతో నోరాకు తిరిగి అవకాశాలు వస్తున్నాయి.    యాడ్ లో అయన చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా మరి.  కష్టపడితేనే ఏదైనా.. 


మరింత సమాచారం తెలుసుకోండి: