ఇటీవల  అయోగ్య తో  హిట్ కొట్టిన యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ సుందర్ సి తో ఓ సినిమా చేస్తున్నాడు.  ఈచిత్రానికి 'యాక్షన్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి తాజాగా టైటిల్ తోకూడిన ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు.  భారీ బడ్జెట్ తో ట్రైడెంట్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశాల్ కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా మలయాళ నటి  ఐశ్వర్య లక్ష్మి ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఆమె కు కోలీవుడ్ లో ఇదే మొదటి సినిమా. 


 యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈఏడాది చివర్లో ఈ చిత్రం విడుదలకానుంది. కాగా విశాల్ సుందర్ సి ఇది రెండో సినిమా. గతంలో వీరి కాంబినేషన్ లో అంబల అనే చిత్రం తెరకెక్కింది. అలాగే తమన్నా తోకూడా  విశాల్ కు ఇది రెండో సినిమా.  వీరి కాంబినేషన్ లో కత్తి సందై అనే చిత్రం తెరకెక్కింది.అయితే ఈ రెండు చిత్రాలు  ప్లాప్ అయ్యాయి. మరి ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ అయినా హిట్ అవుతుందో లేదో చూడాలి. 


ఇక ఈ సినిమాతోపాటు  కొత్త దర్శకుడు ఆనంద్ తో  ఓ సినిమా చేస్తున్నాడు  విశాల్.  గత ఏడాది విడుదలై సూపర్ హిట్ సాధించిన  సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ఇరుంబు తిరై అనే  చిత్రానికి  సీక్వెల్ గా తెరకెక్కుతుందట ఈ చిత్రం.  కాగా ఇరుంబు తిరై తెలుగులో  అభిమన్యుడు పేరుతో విడుదలై  10కోట్ల షేర్ ను రాబట్టి విశాల్ కు మంచి మార్కెట్ ను క్రియేట్ చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: