గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని ఇండస్ట్రీల్లోనూ నెలల గ్యాప్ లోనే వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ సినీ గేయ రచయిత శివగణేశ్‌ కన్నుమూశారు. ప్రేమికుల రోజు, జీన్స్, బాయ్స్, నరసింహ, 7జీ బృందావన్ కాలనీ, ఆస్తి మూరెడు ఆశ బారెడు వంటి చిత్రాలకు పాటలు రాసిన ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.  ఇప్పటికీ ఆ పాటలు మారుమోగుతూనే ఉంటాయి.  బుధవారం ఆయన గుండెపోటుతో మరిణించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో సినీ పరిశ్రమలో విషాదం అలముకుంది. 

ప్రస్తుతం హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఉన్న తన నివాసంలో ఆయన మరణించారు. నాగేంద్రమణి, ఇద్దరు కుమారులు (సుహాస్, మానస్) ఉన్నారు. శివగణేశ్ తెలుగులోనే కాకుండా తమిళ చిత్ర రంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దాదాపు 1000కి పైగా పాటలు రాశారు. తెలుగుతో పాటు పలు తమిళ సినిమాలకు కూడా ఆయన పనిచేశారు. కేవలం పాటల రచయితగానే కాకుండా శివగణేశ్ మాటలు కూడా రాసేవారు. ఆయన ఎక్కువ డబ్బింగ్ చిత్రాలకు సంభాషణలు అందించారు.

యాక్షన్ హీరో అర్జున్ నటించిన  'ఒకే ఒక్కడు'లో ఆయన రాసిన డైలాగులకు మంచి పేరు వచ్చింది. ఈ చిత్రం తర్వాత మరికొన్ని డబ్బింగ్ చిత్రాలకు ఆయన సంభాషనలు రాశారు.  ఆయన డైలాగ్స్ ఎంతో సరళంగా..అందరి గుండెలకు హత్తుకునేలా ఉండేవి.  ఇండస్ట్రీలో శివగణేష్ కి ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆనారోగ్యం కారణంగా ఆయన కొద్ది రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.  కాగా, శివగణేష్ అకాల మరణానికి టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ విషాదం వ్యక్తం చేస్తుంది. మంచి రచయితను కోల్పోయామని వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: