త్రివిక్రమ్ సినిమాల విషయంలో ఎలా కొత్తగా ఆలోచిస్తాడో.. అదే విధంగా తన సినిమా టైటిల్స్ విషయంలో కూడా అంతే కొత్తగా ఆలోచిస్తాడు.  సినిమాలు కొత్తగా ఉండాలని కోరుకుంటూ టైటిల్స్ పెడుతుంటాడు. అయితే, త్రివిక్రమ్, ఇటీవల కాలంలో తన సినిమాలకు అచ్చమైన తెలుగు పేర్లు పెడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.  



ఇక్కడ మరో విషయం కూడా ఉన్నది.  త్రివిక్రమ్ సినిమా టైటిల్స్ విషయంలో ముందుగానే సోషల్ మీడియాలో లీక్ అవుతుంది.  టైటిల్ అది కాదేమో అనుకుంటాం.  కానీ, త్రివిక్రమ్ అదే టైటిల్ ను సినిమాకు పెడతారు.  ఇది చాలా కామన్ గా వస్తూనే ఉన్నది.  మిగతా సినిమాలు అలా కాదు.. ఏదైనా టైటిల్ సోషల్ మీడియాలో లీకైతే దానికి వ్యతిరేకంగా సినిమా టైటిల్ ఉంటుంది.  



అత్తారింటికి దారేది నుంచి దాదాపుగా ఇలానే జరుగుతున్నది.  అత్తారింటిది దారేది సినిమా సోషల్ మీడియాలో లీకైనా కూడా భారీ హిట్ కొట్టింది. ఆ తరువాత అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ పేర్లు అలా పెట్టినవే.  ఇప్పుడు అల్లు అర్జున్ కొత్త సినిమా అల వైకుంఠపురంలో సినిమా టైటిల్ కూడా అలా వచ్చిందే.  టైటిల్స్ తోనే త్రివిక్రమ్ మాయచేస్తాడు.  



గతంలో లాగ త్రివిక్రమ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయాయి.  భారీ బ్లాక్ బస్టర్ హిట్ చూసి చాలా కాలం అయ్యింది.  అత్తారింటికి దారేది తరహా హిట్ ఇవ్వలేకపొతున్నాడు.  అరవింద సమేత హిట్ అయ్యింది కానీ, ఎందుకో ఓ వర్గం ప్రజలకు ఆ సినిమా ఎక్కలేదు.  ఎన్టీఆర్ ను అలా చూపించడం కొంతమందికి నచ్చలేదు.  అల వైకుంఠపురంలో సినిమా ఎలా ఉంటుందో చూడాలి.  ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.  పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో సుశాంత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: