ఈ నెల 22న జరగబోతున్న చిరంజీవి పుట్టినరోజు వేడుకల గురించి దానికి ముందు విడుదల కాబోతున్న ‘సైరా’ ట్రైలర్ గురించి మెగా అభిమానులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ‘సైరా’ ట్రైలర్ కు పవన్ కళ్యాణ్ వాయస్ ఓవర్ ఇచ్చాడు అంటూ వస్తున్న వార్తలు మెగా అభిమానులలో మరింత జోష్ ను పెంచుతున్నాయి. 

ఇలాంటి పరిస్థితులలో పవన్ వాయస్ ఓవర్ ‘సైరా’ ట్రైలర్ కు ఉండటం వల్ల ప్రయోజనం కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి అన్న ఒక సరికొత్త ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం చేస్తున్నవారు ఈ విషయానికి సంబంధించి కొన్ని కారణాలు కూడ వివరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల బాట పట్టినతరువాత సినిమాలను వదులు కున్నాడు. 

మొన్న ఎన్నికలలో పవన్ ఓడిపోయిన పరిస్థితులలో సినిమాలలో నటించమని అభిమానుల నుండి ఇండస్ట్రీ వర్గాల వరకు ఎంతఒత్తిడి వచ్చినా తాను సినిమాలకు దూరం అన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితులలో పవన్ ‘సైరా’ ట్రైలర్ కు వాయస్ ఇవ్వడం అంటే తాను సినిమాలకు దూరం అంటూ చెప్పినమాట తప్పడమే అవుతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ రాజకీయాలలోకి వచ్చిన దగ్గర నుండి పవన్ కు అభిమానులతో పాటు శత్రువుల సంఖ్య కూడ బాగా పెరిగిపోతోంది. 

ముఖ్యంగా గడిచిన ఎన్నికల ప్రచారంలో జగన్ ను చంద్రబాబును టార్గెట్ చేస్తూ పవన్ తీవ్రవిమర్శలు చేయడమే కాకుండా జగన్ విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి అధికారంలోకి వచ్చాడు అంటూ పవన్ కామెంట్స్ చేయడంతో వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అంతా పవన్ కు శత్రువులుగా మారారు. ఇలాంటి  పరిస్థితులలో రాజకీయంగా పవన్ ను విమర్శించే వారి సంఖ్య బాగా పెరిగిన నేపధ్యంలో పవన్ ‘సైరా’ ట్రైలర్ కు వాయస్ ఓవర్ చెపితే పవన్ మాటతప్పాడు అంటూ నెగిటివ్ కామెంట్స్ విపరీతంగా వచ్చే ఆస్కారం ఉందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అయితే జనం రాజకీయాలను సినిమాలను వేరువేరుగా చూస్తున్న పరిస్థితులలో పవన్ వాయస్ ఓవర్ వల్ల ‘సైరా’ కు మరింత క్రేజ్ వస్తుందని మెగా ఫ్యామిలీ ఈ ఆలోచనలు  చేసిన్నట్లు అనుకోవాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: