మరో రెండు రోజులలో జరగబోతున్న ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వార్తలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రామోజీ ఫిలిం సిటీలో జరగబోతున్న ఈ కార్యక్రమం ఇప్పటి వరకు ఏ టాప్ హీరో సినిమాకు జరగని విధంగా అత్యంత భారీ ఖర్చుతో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ కార్యక్రమానికి సంబంధించిన వేదిక నిర్మాణానికి 2.5 కోట్లు ఖర్చు పెడుతున్నారు అని వార్తలు రావడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పడుతున్నాయి. ఈ వేదిక నిర్మాణం కోసం గత వారం రోజులుగా సుమారు 1000 మంది రాత్రి పగళ్ళు పనిచేస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ఒక ప్రత్యేకమైన వేదికను మరొకచోట ఏర్పాటు చేసి ఈ సినిమా కోసం ప్రభాస్ వాడిన మోటార్ సైకిళ్ళతో పాటు ఈమూవీలో ప్రభాస్ వాడిన ఫ్యాన్సీ కార్లు అదేవిధంగా ప్రభాస్ ఈమూవీలో పెట్టుకున్న రకరకాల కళ్ళజోళ్ళ ప్రదర్శన ప్రధాన ఆకర్షణ కాబోతుందని సమాచారం.

ఈ ఈవెంట్ కు సుమారు లక్షమంది ప్రభాస్ అభిమానులు తెలుగు రాష్ట్రాల నుండి కార్లు బస్సులలో రాబోతున్న పరిస్థితులలో అభిమానుల వెహికల్స్ పార్కింగ్ కోసం ప్రత్యేకమైన ప్రాంతాన్ని ఎలాట్ చేయడమే కాకుండా ఈ ఈవెంట్ కు వచ్చే అభిమానులు అందరికీ స్నాక్స్ అదేవిధంగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ ముగిసిన తరువాత కూడ ఈ ఫంక్షన్ కోసం వేసిన ఈ ప్ర త్యేకమైన సెట్ ను జనం చూసే విధంగా కొన్నిరోజులు అలాగే ఉంచుతారని తెలుస్తోంది. 

ఈ ఈవెంట్ ను అన్ని ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్స్ తో పాటు తమిళనాడు కర్నాటక ప్రాంతానికి చెందిన ఆ భాషలకు చెందిన ప్రముఖ ఛానల్స్ లో కూడ లైవ్ టెలికాస్ట్ గా చూపించబోతున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్ తో ఒకేసారి ‘సాహో’ మ్యానియా వచ్చేలా చేసి ఈమూవీ టిక్కెట్లు కనీసం ఒక్క వారంరోజులు అన్ని షోలకు ముందుగా అమ్ముడు అయ్యే విధంగా భారీ పబ్లిసిటీకి శ్రీకారం చుడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: