దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 2 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు పోటీగా వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న వెంకీ మామ సినిమాను అక్టోబర్ 4వ తేదీన విడుదల చేయాలని ముందుగా నిర్మాతలు భావించారు. 
 
కానీ ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం మేరకు వెంకీ మామ సినిమా దసరాకు విడుదల కావటం కష్టమేనని తెలుస్తోంది. వెంకటేష్ కు కొన్ని రోజుల క్రిందట కాలు బెణకటం వలన ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కావటం కష్టమేనని సమాచారం. కాలు బెణకటంతో వెంకటేష్ ఇప్పట్లో షూటింగ్ కు హాజరు కాడని తెలుస్తోంది. వెంకటేష్ కాంబినేషన్లో దర్శకుడు బాబీ తెరకెక్కించాల్సిన సన్నివేశాలు ఇంకా ఉన్నాయని తెలుస్తోంది. 
 
మరోవైపు సైరా సినిమా కూడా వెంకీ మామ సినిమా విడుదల వాయిదా వేయటానికి కారణం అని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన సైరా మేకింగ్ వీడియో సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచింది. దసరా పండుగకు సెలవులు ఎక్కువగానే ఉన్నప్పటికీ సైరా లాంటి భారీ సినిమాకు వెంకీమామ ఎంతమాత్రం పోటీనిస్తాడో చెప్పలేము. సైరా సినిమాకు పోటీగా విడుదల చేయటం కంటే సోలోగా సినిమాను విడుదల చేస్తే ఎక్కువ కలెక్షన్లు సాధించవచ్చని వెంకీమామ యూనిట్ అంచనా వేస్తుందని సమాచారం. 
 
వెంకీమామ సినిమా యూనిట్ స్పందిస్తే మాత్రమే ఈ విషయాల గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో వెంకటేష్ మామగా, నాగ చైతన్య అల్లుడిగా నటిస్తున్నారు. ఎఫ్ 2 హిట్ తరువాత వెంకటేష్, మజిలీ హిట్ తరువాత నాగచైతన్య నటిస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. జై లవ కుశ సినిమాతో హిట్ కొట్టిన బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: