తెలుగు సినిమాను పరిశీలిస్తే కొంతకాలంగా సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. స్మాల్, మీడియం రేంజ్ లో తీస్తున్న ఈ సినిమాలకు ఖర్చు పెడుతున్న బడ్జెట్ కూడా బాగానే రికవరీ అవుతోంది. సినిమాలో కంటెంట్ ఉండటం ప్రేక్షకులకు నచ్చే విధంగా తీయడంతో సినీ అభిమానులు ఈ తరహా సినిమాలపై ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. లాభాలతో నిర్మాతలు సేఫ్ అవుతుంటే.. సక్సెస్ లతో దర్శకులు కెరీర్ ఏర్పరచుకుంటున్నారు.



సినిమా అంతిమ లక్ష్యం చూసే ప్రేక్షకుడికి నచ్చడమే. ఎలా తీసినా ఎంత టెక్నిక్ తో తీసినా, ఎంత బడ్జెట్ పెట్టినా సరే.. కంటెంట్ లేకపోతే ఆ సినిమా నిలవదు. తెలుగులో ఈమధ్య వస్తున్న సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులకు నచ్చుతున్నాయి. కార్తికేయ, సుబ్రహ్మణ్యపురం, 118, క్షణం, గూఢాచారి, ఒక్క క్షణం, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, రాక్షసుడు, ఎవరు.. ఇలా అన్నీ ఓ జోనర్ లో వచ్చినవే. అయినా ప్రేక్షకులు బోర్ ఫీలవటం లేదు. ఇందుకు తాజాగా ‘ఎవరు’ సినిమా సక్సెస్ కావడమే. కంటెంట్ ఉండి సీట్లో కూర్చునే ప్రేక్షకులకు బోర్ కొట్టటం లేదు కాబట్టే ఈ తరహా సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. దర్శకులు కావాలనుకునే వాళ్లు.. కొత్త తరహా కథలు, స్క్రీన్ ప్లే, కంటెంట్ బేస్డ్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ రాసుకుని అంతే పర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు. దీంతో ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 



ఈ తరహా సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్నాడు హీరో అడవి శేష్. క్షణం, గూఢాచారి, ఎవరు సినిమాలతో స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నాడు. త్వరలో గూఢాచారి 2 తో మరో సస్పెన్స్ మూవీతో రానున్నాడు. తను యాక్ట్ చేస్తూ స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు కూడా నెరవేరుస్తూ సక్సెస్ కావడం గొప్ప విషయమే.


మరింత సమాచారం తెలుసుకోండి: