టాలీవుడ్.. ఇది కొన్ని వర్గాల చేతుల్లో.. ఓ నాలుగు కుటుంబాల గుప్పిట్లో బందీ అయ్యిందన్న విమర్శలూ ఉన్నాయి. వాళ్లే తమకు కావాల్సిన వారిని ప్రమోట్ చేస్తారని.. నచ్చనివాళ్లను తొక్కేస్తారని అంటుంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలోని మరో బ్యాడ్ ఎలిమెంట్ నట వారసత్వం. హీరోల కొడుకులే హీరోలు అవుతారని.. బలవంతంగా వారిని ప్రేక్షకులపై రుద్దుతారని కూడా విమర్శ ఉంది.


ఈ అంశం ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా సార్లు హాట్ టాపిక్ అయ్యింది. ఇపుడు ఇదే టాపిక్ పై సీనియర్ నటుడు ఉత్తేజ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. టాలీవుడ్ లోని వారసత్వ నటుల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఒక్కో హీరోపై తన ఒపీనియన్ చెబుతూ వచ్చాడు.


నటవారసత్వం గురించి ఉత్తేజ్ మాట్లాడుతూ... ఇది చాలా కాలం నుంచి ఉంది. ఇది కొత్తదేమీ కాదు.. కాకపోతే.. హీరోల వారసులకు తమను తాము నిరూపించుకునే అవకాశం సులభంగా వస్తుంది. అవకాశాలు సులభంగా దక్కుతాయి. కానీ వారు నిరూపించుకోలేకపోతే.. మాత్రం వారు తెరమరుగు కావడం ఖాయం అంటూ కుండబద్దలు కొట్టారు ఉత్తేజ్..


ఇక ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలపైనా తన ఒపీనియన్ చెప్పేశాడు ఉత్తేజ్.. జూనియర్ ఎన్టీఆర్ గురించి కామెంట్ చేస్తూ.. అతడిలో యాక్టర్ కనిపిస్తాడన్నారు. అంతే కాదు.. యాక్టర్ వేరు.. ఆర్టిస్టు వేరు. స్టార్ డమ్ తో పాటు వృత్తినిబద్ధత ఉన్న నటుడు అంటూ జూనియర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఒకవేళ సీనియర్ ఎన్టీఆర్ ఆత్మ వచ్చి ఈయనలో ఉండిపోయిందేమో.. అంటూ ఛలోక్తి విసిరాడు ఉత్తేజ్.


ఇక రామ్ చరణ్ ఎంతో ప్రొఫెషనల్ గా ఉంటారని.. తండ్రి నుంచి వచ్చిన మంచిలక్షణమని చెప్పారు. అల్లు అర్జున్ గురించి చెబుతూ... బన్నీ తనని తాను ఉలి వేసి చెక్కుకున్నాడని ప్రశంసించారు. గంగోత్రితో పోల్చి చూస్తే అసలు అప్పటికి ఇప్పటికి ఎలాంటి సంబంధం లేదన్న విషయం అంతా ఒప్పుకుంటారని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: