రాజకీయాలకు ఆమడ దూరంలో ఉండే ప్రభాస్ ఇప్పటి వరకు ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ పైనా అదేవిధంగా ముఖ్యమంత్రుల పైనా కామెంట్స్ చేయలేదు. భారతీయ జనతా పార్టీలోకి ప్రభాస్ ను తీసుకు వస్తే కృష్ణంరాజుకు పదవి ఇస్తామని రాయబారాలు చేసినా ఆ విషయాలపై ఎప్పుడు ప్రభాస్ ఆశక్తి కనపరచలేదు. గతంలో కృష్ణంరాజుతో కలిసి ప్రభాస్ మోడీని కలినప్పుడు ఆయన స్వయంగా ప్రభాస్ ను భారతీయ జనతా పార్టీలోకి రమ్మని ఆహ్వానించినా ప్రభాస్ మౌనం వహించాడు.

అయితే ప్రభాస్ నోటి వెంట ఒక ముఖ్యమంత్రి పై ప్రశంసలు రావడం అతడి అభిమానులకు కూడ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈమధ్య ‘సాహో’ ను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంత్రి జగన్ మోహన్ రెడ్డి పై వ్యూహాత్మక కామెంట్స్ చేసాడు. ఆంధ్రపదేశ్ లో జగన్ పరిపాలన ఎలా ఉంది అంటూ ఎదురైన ప్రశ్నకు ప్రభాస్ తెలివైన సమాధానం ఇచ్చాడు. 

తాను రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకొనని మంత్రులుగా ఇప్పుడు ఎవరు ఉన్నారు అన్న విషయం కూడ తనకు పూర్తిగా తెలియదు అనీ అయితే జగన్ ఆంధ్రప్రదేశ్ లో ఒక విభిన్నమైన పరిపాలన కోసం ప్రయత్నిస్తున్న విషయం రాజకీయాలు తెలియని తన దృష్టి వరకు వచ్చిందని అంటూ కామెంట్ చేసాడు. అంతేకాదు జగన్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని తాను ఆశిస్తున్నాను అంటూ కామెంట్స్ చేసాడు. 

‘సాహో’ విడుదల అవుతున్న సమయంలో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాప్ హీరోలతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించిన ప్రభాస్ తాను అందరి వాడిని అన్న సంకేతాలు ఇస్తున్నాడు. ఇప్పుడు జగన్ పరిపాలన పై తనకు రాజకీయాలు తెలియదు అంటూనే పరోక్షంగా జగన్ పరిపాలనను మెచ్చుకున్న తీరును బట్టి ప్రభాస్ ‘సాహో’ కోసం చాల మారిపోయాడు అని అనిపిస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: