రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో నుండి తనను తప్పిస్తారేమోననుకుని బయపడ్డాడట బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్. ఈ సినిమాలో ఆయన ప్రభాస్ కు ఫ్రెండ్ రోల్ లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన సినిమాలోని నీల్ నితిన్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా నీల్ ఓ జాతీయ పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ... గాలా అవార్డుల్లో డైరెక్టర్ సుజీత్ నాకు పరిచయం అయ్యాడు.ఆ తరువాత కొద్దీ రోజలకు మా ఇంటికి వచ్చి నాకు సాహో కథ చెప్పాడు. అతని నరేషన్ అలాగే నా పాత్ర కు ఇంప్రెస్ అయ్యి వెంటనే సినిమాకు ఓకే చెప్పాను. 2015 బహుబలి విడుదల సమయంలో ఇదంతా జరిగింది.
ఆ తరువాత బాహుబలి 2కోసం ప్రభాస్ మరో రెండు సంవత్సరాలు టైం తీసుకోవడంతో మేము ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ గ్యాప్ లో నేను వేరే సినిమాలు కూడా చేశాను కానీ సాహో స్టార్ట్ అయ్యే ముందు చాలా మంది నటీనటులను మార్చారు. దాంతో నా పాత్రకు కూడా వేరే వారిని తీసుకున్నారేమో అన్న భయం వేసింది. కానీ సుజీత్ ఇచ్చిన మాటను నిలబెట్టుకొని నాకు సాహో లో నటించే అవకాశం ఇచ్చాడు. షూటింగ్ కూడా చాలా రోజులు సాగింది. షూటింగ్ లో భాగంగా అబుదాబి లో ప్రభాస్ ను మొదటి సారి కలిశాను. అతను నిరాడంబరుడు. సాహు లో ఓ భాగమైనందుకు నాకు చాలా గర్వంగా వుందంటూ ముగించాడు నీల్ నితిన్ ముఖేష్. ఇక భారీ అంచనాలతో ఈ చిత్రం తెలుగు , హిందీ , మలయాళ , తమిళ భాషల్లో ఈనెల 30న గ్రాండ్ గా విడుదలకానుంది.