‘సాహో’ ను ప్రమోట్ చేస్తూ చెన్నైలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను ప్రశంసిస్తూ చేసిన కామెంట్స్ తెలుగుదేశం కేడర్ కు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లు వార్తలు వచ్చాయి. దీనితో ‘సాహో’ ను ఫెయిల్ చేయడానికి నెగిటివ్ ప్రచారానికి రెడీ అవుతున్నారు అంటూ ఒక మీడియా సంస్థ ప్రచురించిన కథనం తీవ్ర సంచలనంగా మారింది. 

రాజకీయాలకు దూరంగా ఉండే ప్రభాస్ యధాలాపంగా అన్న మాటలు ‘సాహో’ కి శాపంగా మారిపోతాయా అంటూ ఆ మూవీ బయ్యర్లు కూడ భయపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో తెలుగుదేశం ముఖ్యనాయకుడు నారా లోకేష్ రంగంలోకి దిగి ఈ ప్రచారం అంతా పూర్తి అబద్ధం అంటూ క్లారిటీ ఇవ్వడమే కాకుండా తాను ‘సాహో’ ను మొదటిరోజు మొదటి షో చూడబోతున్నాను అంటూ క్లారిటీ ఇవ్వడంతో ఈ మూవీ బయ్యర్లు తెరిపిన పడ్డారు.

గత కొంత కాలంగా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు తిరిగి మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ చంద్రబాబునాయుడును టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ప్రభాస్ నోటివెంట జగన్ పై ప్రశంసలు రావడంతో చాలామంది ఆశ్చర్య పోయారు. 

అయితే ఈ వివాదం అనవసరంగా సామాజిక వర్గాలకు సంబంధించిన పెను వివాదంగా మారకముందే లోకేష్ తెలివిగా ఈ వ్యవహారానికి ముగింపు పలికి మంచి చేసాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఇప్పటికే ‘సాహో’ కు అనుకోకుండా డివైడ్ టాక్ వస్తే ఆ మూవీని టార్గెట్ చేయడానికి ఇండస్ట్రీలో ప్రభాస్ వ్యతిరేక వర్గం సిద్ధంగా ఉంది. దీనికి రాజకీయం కూడ తోడైతే ఫలితం మరోలా ఉంటుంది కాబట్టి తెలుగుదేశం అధినాయకత్వం ఈ విషయంలో చాల తెలివిగా వ్యవహరించింది అనుకోవాలి ఏమైనా ‘సాహో’ ను దెబ్బ తీయాలని కనిపించని శక్తులు చాల ప్రయత్నాలు చేస్తున్నట్లు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: