ఇప్పుడు నిర్మాణ వ్యయం పెరిగింది.  దానికి తగ్గట్టుగా షూటింగ్ సమయం పెరుగుతున్నది.  100 రోజుల్లో పూర్తి చేయాల్సిన సినిమాలు సంవత్సరాల తరబడి తీస్తున్నారు.  హిట్టా ఫట్టా అన్నది పక్కన పెడితే.. సంవత్సరాల తరబడి షూటింగ్ చేయడం వలన సినిమాకు అనేక ఇబ్బందులు వస్తాయి.  నటీనటుల విషయంలో తేడాలు వస్తాయి.  ఎక్కువ డేట్స్ తీసుకోవడం వలన ఎక్కువ డబ్బులు చెల్లించాలి.  ఏదైతే తేడా వస్తే రీ షూట్ పేరుతొ మరలా షూట్ చేస్తుంటారు.  ఇలా ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. టెక్నాలిజీ పెరిగింది కాబట్టి షూటింగ్ సమయం తగ్గిపోవాలి.  కానీ, మనవాళ్ళు అందుకు విరుద్ధంగా చేస్తున్నారు.  


అయితే, ఈ టెక్నాలజీ లేని రోజులోనే మన దర్శకులు ఎన్నో గొప్ప సినిమాలు తీశారు.  అదరగొట్టారు.  వావ్ అనిపించేలా మెప్పించారు.  వారిలో ఒకరు జానపద బ్రహ్మ విఠలాచార్య.  సాంఘిక సినిమాల కంటే ఎక్కువగా అయన జానపద చిత్రాలే చేశారు. ఈ సినిమాలు చేయడం అంటే మాములు విషయం కాదు.  అప్పట్లో టెక్నాలజీ లేదు.  కేవలం కెమెరా ట్రిక్స్ తోనే మాయా చేయాలి.  ఇప్పటిలా గ్రాఫిక్స్ లేదు.. తెలివిగా షూట్ చేయాలి.  జరుగుతున్నది తెరపై నిజమేనేమో అనిపించే విధంగా కనిపించాలి.


అప్పుడే సినిమాలో రియాలిటీ కనిపిస్తుంది.  జానపద చిత్రం ఇప్పుడు తీయమంటే రాజమౌళిలా సంవత్సరాలు తీస్తారు.  కానీ విఠలాచార్య కొద్దిరోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేవారు.  అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేసేవారు.  అలా ఎన్నో సినిమాలను అయన తీశారు.  ఎన్నో హిట్స్ కొట్టాడు.  కనకదుర్గ పూజ, గురువును మించిన శిష్యుడు, బందిపోటు, మంగమ్మ శపధం, జ్వాలాద్వీప రహస్యం, పిడుగురాముడు, అగ్గిబరాట, చిక్కడు దొరకడు ఇలా ఎన్నో సినిమాలకు అయన దర్శకత్వం వహించారు.


ఈ సినిమాలన్ని సూపర్ హిట్ అయ్యాయి.  విటలాచార్య సినిమా తీసే సమయంలో ఆర్టిస్టుల గురించి అసలు పెద్దగా భయపడేవారు కాదట.  ఎందుకంటే.. అనుకున్న సమయానికి కనుక ఆర్టిస్టులు రాకపోతే.. అప్పటికప్పుడు స్క్రిప్ట్ లో మార్పులు చేసి అయన సినిమాలో వాళ్ళను పిల్లులు లేదా కుక్కలుగా మార్చేసేవారట.  దీంతో ఆర్టిస్టులు సరిగ్గా సమయానికి రావడానికి ఆసక్తి చూపించేవారు.  అలానే అయన తీసిన జగన్మోహిని సినిమాలో దెయ్యం పొయ్యిలో కాలుపెట్టి మంట వెలిగించే దృశ్యం ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్విస్తుంది.  ఇప్పటికి ఈ సన్నివేశాన్ని ప్రేక్షకులు తెగ చూసేస్తుంటారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: