ఈ మద్య సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మొహమ్మద్‌ జహుర్‌ ఖయ్యాం హష్మి(93)  కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్ష‌న్‌తో బాధ‌ప‌డుతున్నారు.  ఈ నేపథ్యంలో గ‌త నెల 28న ఆయ‌న ఆరోగ్యం పూర్తిగా క్షీణించ‌డంతో ముంబైలోని సుజ‌య్ ఆసుప‌త్రిలో చేర్పించారు. గ‌త రాత్రి ఖ‌య్యాంకి కార్టియాక్ అరెస్ట్ కావ‌డంతో తుదిశ్వాస విడిచారు.ఈ మధ్య కొంచెం కోలుకున్నట్లు తెలిసింది. అయితే, సోమవారం రాత్రి ఆయనకు విపరీతమైన చాతి నొప్పి వచ్చిందని సమాచారం.

ఆ తర్వాత కొద్దిసేపటికే గుండె ఆగిపోవడంతో ఖయ్యాం తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి. లూథియానా నుంచి 17 ఏళ్లకే ఖయ్యాం సంగీత ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి ఆయన ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించారు.  ఖయ్యాం హష్మి సంగీతంలో మెలోడీ తో పాటు మంచి క్లాసిక్ కూడా ఉంటడం ఆయనకు సంగీత ప్రయాణానికి ఎంతో దోహదపడింది. అప్పట్లో బాలీవుడ్ లో సంగీత ప్రపంచంలో ఎన్నో పోటీలు ఉండేవి..కానీ తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నారు ఖయ్యాం హష్మి.   ‘ఉమ్రావ్‌ జాన్‌’ ‘కభీకభీ’ సినిమాలతో ఖయ్యాం పేరు బాలీవుడ్‌లో మార్మోగిపోయింది.  ఈ సినిమాలో అందించిన సంగీతానికి అందరూ ఫిదా అయిపోయారు.

అంతేకాదు, ఈ మూవీకి గానూ ఖయ్యాంకు జాతీయ అవార్డు, ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కింది.  వీటిలో పాటు ఎన్నో అవార్డులు ఆయన సొంతం అయ్యాయి. ఖయ్యాం చేసిన సేవలకు గానూ 2007లో సంగీత నాటక అకాడమి అవార్డుతో పాటు 2011లో ప్రతిష్టాత్మ పద్మభూషణ్‌ అవార్డు ఆయనను వరించాయి. ఖయ్యాం మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, గాయని లతా మంగేష్కర్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక మంచి సంగీత దర్శకుడిని కోల్పోయామని బాలీవుడ్ సీనీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: