ప్రభాస్ సాహు సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతున్నది.  ఇటీవలే హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించారు.  ఈ మూవీలోని మూడో సాంగ్ ను కూడా అదే వేదిక మీదనుంచి ఓపెన్ చేశారు.  హైదరాబాద్ వేడుక తరువాత ప్రభాస్ చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.  ఇందులో ప్రభాస్ అనేక విషయాల గురించి పేర్కొన్నాడు.  అదే విధంగా అక్కడి మీడియాకు ఇచ్చిన ఓ చిన్న ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడారు.  



ప్రభాస్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాలన గురించి అడగ్గా.. దానికి అయన తెలివిగా సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.  జగన్ పాలన బాగుంది అని చెప్పాడు.  దీంతో ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో వైకాపా పార్టీ నేతలు ప్రచారం చేశారు.  సాహో సినిమాను చూడాలని కోరుతూ ఆకాశానికి ఎత్తారు.  అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు సోషల్ మీడియాలో ప్రభాస్ కు రివర్స్ గా మాట్లాడారు.  



ఇది చిలికిచిలికి గాలివానలా మారింది. ఈ సినిమా వ్యవహారం కాస్త రాజకీయంగా మారిపోయింది.  ప్రభాస్ ఎప్పుడు ఎవరితో ఎలాంటి విరోధం పెట్టుకోడు.  అందరికతో కలిసి మెలిసి ఉంటాడు.  కానీ, ప్రభాస్ సినిమాకు ఇలా రూమర్ రావడం విచారించదగ్గదే.  ఇక ప్రభాస్ రాజకీయాల్లోకి వస్తారా అనే దానిపై ఇప్పుడు ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.  



ప్రభాస్ రాజకీయ ప్రవేశం ఇతర అంశాల గురించి ప్రభాస్ పెద్దమ్మను మీడియా ప్రశ్నించగా.. ఆమె ఆసక్తి కరమైన సమాధానం ఇచ్చింది.  ప్రభాస్ భవిష్యత్తులో ఎప్పుడైనా రాజకీయాల్లోకి రావొచ్చునని.. అవసరం అనిపించినపుడు రావడంలో తప్పేమి లేదని ఆమె అన్నారు. ఎలాగో పెదనాన్న కృష్ణంరాజు రాజకీయాల్లోనే ఉన్నారు.  బీజేపీ తరపున ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా అయన పనిచేశారు.  భవిష్యత్తులో ప్రభాస్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉన్నది అనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.  అందరిలానే రాజకీయాల్లోకి వచ్చే ముందు ప్రభాస్ తప్పకుండా రాజకీయాలతో కూడిన సినిమా తీసి వస్తారేమో.  


మరింత సమాచారం తెలుసుకోండి: