మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రెస్టీజీయిస్ మూవీ సైరా.. నరసింహారెడ్డి చిత్రం టీజర్ మెగాస్టార్ జన్మదిన కానుకగా రిలీజైంది. ముంబయి లో జరిపిన ఈవెంట్ లో టీజర్ ను రిలీజ్ చేశాడు చిత్ర నిర్మాత రామ్ చరణ్. ఈవెంట్ కు బాలీవుడ్ మీడియా అధిక ప్రాధాన్యం ఇచ్చింది. కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవీ, తమన్నా, చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మెగాస్టార్ తో నటించడం ఎవరికైనా ఒక ఎచీవ్ మెంటే. తమన్నా ఇదే ఆనందాన్ని మీడియాతో షేర్ చేసుకుంది.

 


పలు బాలీవుడ్ సినిమాల్లో తమన్నా నటించింది. బాహుబలితో ఆమెకు ఆలిండియాలో క్రేజ్ ఉంది. దీంతో ఆమెపై అక్కడి మీడియా ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో ఆమెకు కొన్ని ప్రశ్నలు సంధించారు. తమన్నా మాట్లాడుతూ.. “తెలుగు సినిమాల్లో నటిస్తున్నప్పటి నుంచీ మెగాస్టార్ చిరంజీవి గారితో నటించాలనే కోరిక ఉండేది. ఇప్పుడు సైరా తో ఆ కోరిక నెరవేరింది. చిరంజీవి గారితో స్క్రీన్ షేరింగ్ అంటే జీవితంలో ఓ ఘనత సాధించినట్టే. ఈ సినిమాలో నాది చాలా క్లిష్టమైన పాత్ర. సురేందర్ రెడ్డి గారితో ఇంతకుముందు కూడా సినిమా చేశాను. చాలా మంచి ఆఫర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు” అంటూ తన అనుభవాన్ని పంచుకుంది ఈ మిల్కీ బ్యూటీ.

 


మెగాస్టార్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడా అని చూసిన ఈ ట్రైలర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ తో ఆకట్టుకుంది. చిరంజీవి రోరింగ్ పెర్ఫార్మెన్స్ తో టీజర్ అదిరిపోయింది. గ్రాండ్ విజువల్స్, మ్యూజిక్, క్యారెక్టర్స్ తో ఉన్న ఈ టీజర్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు కనపడేలా ఉన్న టీజర్ హిందీ, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: