టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరో ఫ్యామిలీ ఇంట్లో త్వ‌ర‌లోనే పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. ఆ ఫ్యామిలీకి చెందిన వార‌సురాలు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మూడు నాలుగు సినిమాలు చేసినా కాలం క‌లిసి రాక అన్ని డిజాస్ట‌ర్ అయ్యాయి. దీంతో పెళ్లి చేసేస్తాం అని చెప్ప‌గా కాస్త టైం అడిగింద‌ట‌. దీంతో మ‌ళ్లీ ఒక‌టి రెండు అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. 


ఇక ఆ స్టార్ హీరో త‌మ్ముడి కొడుకు అంటే పైన చెప్పుకున్న వార‌సురాలికి అన్న వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్నార‌ట‌. త‌మ కుటుంబానికి త‌గిన అమ్మాయిని వెతికేప‌నిలో ఆ ఫ్యామిలీ బిజీగా ఉన్న‌ట్టు వార్త‌లు చ‌క్కెర్లు కొడుతున్నాయి. ఆ యూత్ హీరో హీరో ఇండస్ట్రీలో సెటిలైపోయాడు. ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. అత‌డి సినిమాల‌కు బిజినెస్ కూడా బాగానే జ‌రుగుతోంది.


ఇక వచ్చేనెల ఊర మాస్ అవతారంలో చేసిన ఓ రీమేక్ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కొడుకు పెళ్లి కోసం ఆ హీరో నాన్న హైదరాబాద్ కు చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తతో చర్చించినట్టు సమాచారం. ఆ పారిశ్రామిక‌వేత్త అమ్మాయి ఆ యంగ్ హీరోకు కూడా న‌చ్చిందంటున్నారు. ఈ హీరో పెళ్లిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. 


ఇక ఈ హీరోకు చెల్లి విష‌యానికి వ‌స్తే ఆ అమ్మాయీ నాలుగైదు సినిమాలు చేసింది కానీ అదృష్టం కలిసి రాక అన్ని డిజాస్టర్ అయ్యాయి. ముందు ఆ హీరో కంటే ఆమె పెళ్లి చేయాల‌ని ఆ స్టార్ హీరోతో పాటు ఆమె తండ్రి డిసైడ్ అయినా ఆమె మ‌రో ఒక‌టి రెండు సినిమాల‌తో త‌న‌ను ఫ్రూవ్ చేసుకోవాల‌నుకుంటున్నాన‌ని చెప్ప‌డంతో ముందుగా అన్న‌య్య‌కే పప్ప‌న్నం పెట్టాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌.  ఏదేమైనా స్టార్ హీరో ఫ్యామిలీలో కాస్త గ్యాప్‌లోనే హీరో, హీరోయిన్ పెళ్లితో కాస్త సంద‌డి సంద‌డిగానే వాతావ‌ర‌ణం ఉండ‌నుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: