సాహో ఈనెల 30 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది.  టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లోనే ఈ సినిమాను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు.  ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అంతకు ముంచి సినిమాకోసం సోషల్ మీడియాను కూడా వాడుకుంటున్నారు.  


ఇదిలా ఉంటె, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా రూ. 350 కోట్ల రూపాయల పైనే జరిగింది.  సాహో కు అంతటి హైప్ రావడానికి కారణం బాహుబలి.  బాహుబలి రెండు సిరీస్ లు హిట్ అయ్యాయి.  దీంతో ప్రభాస్ మార్కెట్ పెరిగింది.  మార్కెట్ పెరగడంతో.. సాహో సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా తీర్చి దిద్దడానికి రెడీ అయ్యారు.  


మాములుగా ఈ సినిమాను మొదట 70 నుంచి 80 కోట్ల మధ్యలో పూర్తి చేయాలని అనుకున్నా.,. నిర్మాతల పట్టుదలతో సినిమాకు దాదాపుగా 250 కోట్ల దాకాఖర్చు చేశారు.  బిజినెస్ బాగానే జరిగింది.  సినిమా విజయంపైనే నెక్స్ట్ రాబోయే సైరా మూవీ ఆధారపడి ఉన్నది.  సాహో హిట్టయితే.. సైరా మూవీకి ఆటోమాటిక్ గా హైప్ క్రియేట్ అవుతుంది.  ఫలితం బాలీవుడ్ లో తెలుగు సినిమా హవా పెరుగుతుంది.  


అలా కాకుండా  సాహో ఏదైనా తేడా జరిగి ఫెయిల్ అయితే.. డిస్ట్రిబ్యూటర్లు భారీగానష్టపోతారు.  దీని ప్రభావం నెక్స్ట్ రాబోయే సైరాపై పడుతుంది. సినిమా బాగుంది.. అని చెప్పి టాక్ వచ్చే వరకు సైరాకు బాలీవుడ్ లో కలెక్షన్స్ ఉండవు.  కలెక్షన్లు లేకుంటే.. సైరా బాలీవుడ్లో ఇబ్బంది పడాల్సివస్తుంది .  ఒకవేళ సాహో హిట్టయితే.. బాలీవుడ్లో ఈ మూవీ భారీ విజయం సాధిస్తుంది.   దాదాపు 25 ఏళ్ల తరువాత మెగాస్టార్ తిరిగి బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు.  ఈ సినిమాపైనే మెగాస్టార్ బాలీవుడ్ ఎంట్రీ ఆధారపడి ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: