ప్రభాస్ సాహో మూవీ ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాకు సంబంధించిన అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.  మొదటి నుంచి ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు.  అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ ఉన్నది.  ట్రైలర్ తరువాత ఈ అంచనాలు భారీగా పెరిగాయి.  ఈ అంచనాలను బట్టి సినిమా ఎలా ఉండబోతుందో అర్ధం అవుతున్నది.  

అయితే, సాహో విషయంలో మరో న్యూస్ బయటకు వచ్చింది.  సాహో సినిమా సెన్సార్ పూర్తయిందని, అనుకున్నట్టుగానే యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిందని టాక్.  ఏ సర్టిఫికెట్ ఇస్తే.. దాని వలన సినిమాకు కొంత నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. 

మాములుగా యాక్షన్ సినిమాలకు ఏ సర్టిఫికెట్ ఇస్తారు.  ఇండియాలో ఏ అంటే కొంత ఇబ్బందే.  అందుకోసమే అలాంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారట.  ఇక సినిమా ఓపెనింగ్ తోనే ప్రేక్షకులను సినిమాలో అంతర్లీనం అయ్యేవిదంగా ఓపెనింగ్ సీన్స్ ఉన్నాయని టాక్.  



సినిమాకు ఇంటర్వెల్ బ్యాంగ్ మరో హైలైట్ అని తెలుస్తోంది.  ఎవరూ ఊహించని విధంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండబోతున్నది.  క్లైమాక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  క్లైమాక్స్ సీన్స్ ప్రతి ఒక్కరికి గూస్ బమ్స్ గ్యారెంటీ అంటున్నారు.  సినిమా యాక్షన్ అంతా ఒకెత్తయితే.. క్లైమాక్స్ సీన్స్ మరొక ఎత్తు. ఎవరి ఊహకు అందకుండా సినిమా ఉంటుందని చెప్తున్నారు.  



ఇందులో ప్రతి పాత్రను అద్భుతంగా డిజైన్ చేసినట్టు సమాచారం.  హీరో రోల్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో.. విలన్ రోల్స్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటాయట.  మొదటిసారి శ్రద్దా కపూర్ కాప్ గా చేస్తున్నది.  ఆమె పాత్ర కూడా సినిమాకు మరో హైలైట్ అవుతుందట.  ఇందులో ఎంతమేరకు నిజం ఉన్నదో తెలియాలంటే మాత్రం ఆగష్టు 30 వరకు ఆగాల్సిందే.  ఆగష్టు 30 అంటే ఇంకెన్నో రోజులు లేదు.  వారం రోజులు మాత్రమే ఉన్నది.    


మరింత సమాచారం తెలుసుకోండి: