నాలుగు వారాల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ షో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ప్రతి రోజు కొత్త కొత్త టాస్కులు, చిన్న చిన్న వివాదాలతో ప్రేక్షకుల్ని ఈ షో అలరిస్తుంది. బాబా భాస్కర్ ను అలీ రేజా ఎలిమినేషన్ కు నామినేట్ చేయటంతో వాళ్ళిద్దరూ మాట్లాడుతున్న సమయంలో మహేశ్ విట్టా రాగా అలీ రేజా మహేశ్ విట్టాను పుల్లలు పెట్టొద్దు అని చెబుతాడు. ఈ విషయం గురించి అలీ రేజా, మహేశ్ విట్టా మొదట మాట్లాడుకొంటారు. 
 
అక్కడితో మహేశ్ విట్టా, అలీ మధ్య గొడవ ఆగిపోతుంది. బిగ్ బాస్ కోర్ట్ యార్డ్ లో లెటర్స్ ఉంచుతాడు. ఆ లెటర్స్ లో కంప్లైంట్స్ ఏమైనా ఉంటే రాయమని బిగ్ బాస్ చెబుతాడు. అనవసరంగా ఇతరుల విషయాల్లో దూరి అనవసరమైన సలహాలు ఇస్తాడని ఇంకా రెచ్చగొడతాడని పేరు చెప్పకుండా మహేశ్ విట్టాపై కంప్లైంట్ వస్తుంది. మిగతా సభ్యుల విషయంలో జోక్ చేస్తున్నాడు అనవసరంగా ఒపీనియన్స్ ఇస్తున్నాడు అది మిగతా ఇంటి సభ్యులకు చూడటానికి, వినటానికి ఇబ్బందిగా ఉంటుంది అని  పునర్నవి కంప్లైంట్ ఇస్తుంది. 
 
హౌస్ మేట్స్ ను తక్కువ చేసి మాట్లాడతాడని, ఎదుటి మనిషికి మర్యాద ఇవ్వడని, హీరో అవడానికి బిగ్ బాస్ నియమాలు తప్పాడని మహేశ్ అలీ రేజాపై కంప్లైంట్ ఇస్తాడు. అలీ రేజా సమాధానంగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడే సమయంలో మూడో వ్యక్తి రాకూడదని మహేశ్ విట్టాకు చెబుతాడు. నేను ఏమీ మాట్లాడకముందే పుల్లలు పెడతానని అన్నాడని మహేశ్ అలీ రేజా గురించి చెబుతాడు. అలీ రేజా మహేశ్ విట్టా మధ్య గొడవ అంతకంతకూ పెరుగుతుంది. 
 
రాహుల్ కాన్ఫిఢెన్స్ పెంచుకోవాలని వరుణ్ కంప్లైంట్ ఇస్తాడు. రాహుల్ ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనల వలన డల్ అయ్యానని చెబుతాడు. నీతో ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాని రాహుల్ కంప్లైంట్ లెటర్లో శ్రీముఖి గురించి రాసి రాహుల్ శ్రీముఖితో సమస్యల గురించి వివరించే ప్రయత్నం చేస్తాడు. శివజ్యోతి రాహుల్, మహేశ్ విట్టా మీద ఎక్కువగా కంప్లైంట్స్ ఉన్నాయని బిగ్ బాస్ కు చెబుతుంది. బిగ్ బాస్ ఆదేశం మేరకు మహేశ్, రాహుల్ ఇద్దరినీ జైలులో పెట్టి తాళం వేస్తుంది శివజ్యోతి.



మరింత సమాచారం తెలుసుకోండి: