మలైకా అరోరా పేరు అందరికి సుపరిచితమే.. ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది.  హీరోయిన్ గా కంటే కూడా ఆమె ఐటెం సాంగ్ స్పెషలిస్ట్ గా ఆమెకు పేరు ఉన్నది.  ఖాన్ కుటుంబంలోని సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను వివాహం చేసుకొని చాలా కాలం కలిసి కాపురం చేశారు.  ఆ తరువాత ఇటీవలే ఈ ఇద్దరు విడిపోయారు.  వీరికి ఓ కొడుకు కూడా ఉన్నారు.  మలైకా .. అర్బాజ్ ఖాన్ విడిపోవడానికి కారణాలు ఉన్నాయి. మలైకా అరోరా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ను ప్రేమించింది.  


గత కొంతకాలంగా వీరిద్దరూ పీకలలోతు ప్రేమలో ఉన్నారు.  ఎక్కడికైనా సరే ఇద్దరు కలిసి వెళ్తుంటారు.  పార్టీలకు, విదేశాలకు ఎక్కడికైనా సరే జంటగా వెళ్లాల్సిందే.  అయితే, ఈ ఇద్దరు వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తలను ఇప్పటి వరకు ఇద్దరిలో ఎవరు కూడా కన్ఫర్మ్ చేయలేదు.  అర్జున్ .. మలైకా వివాహం ఇటు కపూర్ ఫ్యామిలీకిగాని, అటు ఖాన్ కుటుంబానికిగాని ఇష్టం లేదు.  


వీరితో వైరం పెట్టుకొని సున్నం పోసుకోవడం కంటే అర్జున్ తో ఎప్పటిలా సహజీవనం చేస్తూ ఉండటమే బెటర్ అనుకుందేమో మరి.. వివాహం గురించి అడిగితె నో కామెంట్స్ అని చెప్తున్నది.  వివాహం చేసుకోబోనని ఈ అమ్మడు ఇటీవలే తెగేసి చెప్పింది.  దీంతో అర్జున్ కపూర్ ఎలా స్పందిస్తారో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అర్జున్ కపూర్ మాత్రం దీనిపై ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు.  


పైగా ఆ విషయం గురించి తనను అడగవద్దని చెప్తున్నాడు.  దీంతో అర్జున్ కపూర్.. మలైకాల మధ్య రగడ జరిగిందని కొన్ని పుకార్లు వస్తున్నాయి.  అలాంటిది ఏమి లేదని, త్వరలోనే మలైకా తన కొడుకు అర్హన్ ఖాన్ ను బాలీవుడ్ కి పరిచయం చేయబోతున్నది.  ఇలా బాలీవుడ్ కు హీరోగా పరిచయం చేయాలి కాబట్టి ఇటు కపూర్ కుటుంబంతో కానీ, అటు ఖాన్ కుటుంబంతో కానీ వైరం పెట్టుకోకూడదని అనుకుంటోంది.  అందుకే ఈ విషయములో కొంతకాలం సైలెంట్ గా ఉంటేనే మంచిదని అనుకుంటోంది.  అర్జున్ కపూర్ కూడా దాదాపుగా ఇలానే ఆలోచిస్తున్నాడు.  అర్జున్ మాత్రం మలైకను తప్పించి మరొకరిని లైక్ చేస్తారని అనుకోవడంలేదు.  మరి ఈ ఇద్దరి వ్యవహారం ఎప్పటికి ముడిపడుతుందో చూడాలి.  ఇప్పటికే ఇద్దరిపై అనేక రూమర్లు వస్తున్నాయి.  అర్జున్ కపూర్ కూడా వయసు పెరుగుతున్నది. అర్జున్ కపూర్ పెళ్లి విషయంలో బోనికపూర్ ఎలా స్పందిస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: