రాబోతున్న సంక్రాంతి రేస్ మహేష్ అల్లు అర్జున్ మూవీల మధ్య రేస్ గా మారడంతో ఈ సంక్రాంతి రేస్ విజేత ఎవరు అన్న విషయమై ఇప్పటి నుంచే ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ భారీ సినిమాల పోటీని లెక్క చేయకుండా కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘ఎంత మంచివాడవయ్యా’ మూవీ విడుదల కాబోతున్న పరిస్థుతులలో కళ్యాణ్ రామ్ ధైర్యం పై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. 

‘శతమానం భవతి’ లాంటి అవార్డు మూవీని తీసిన సతీష్ వేగ్నేశ  దర్శకత్వంలో రాబోతున్న ఈమూవీ కథకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయటకు లీక్ అయింది. ఈమూవీ కథ గత ఏడాది గుజరాతీ భాషలో విడుదలై సంచలనం సృష్టించిన ‘ఆక్సిజన్’ మూవీ కథకు రీమేక్ అని తెలుస్తోంది. 

గుజరాతి హీరో అన్షుల్ త్రివేది హీరోగా చిన్మయ్ పురోహిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ అక్కడ పెద్ద హిట్. ఎమోషన్స్ ఎక్కువగా ఉండే ఈమూవీకి అవార్డులతో పాటు మంచి విజయం కూడ వచ్చింది. ఈమూవీ కథకు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా చాల మార్పులు చేర్పులు చేసి సతీష్ వేగ్నేశ చాల జాగ్రత్తగా ఈమూవీని తీస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. 

ఈమూవీ కథలోని ఒరిజినల్ ఎమోషన్ ని మిస్ కాకుండా తీస్తున్న ఈమూవీ ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని సమాచారం. తనకు కావాల్సిన వాళ్ళకే కాక అపరిచితులకు సైతం మంచి చేయాలని చూసే ఒక అతిమంచివాడి కథ ఈ ‘ఆక్సిజన్’. అందుకే ఈమూవీకి ‘ఎంత మంచివాడవయ్యా’ అన్న టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు టాక్. దీనితో రెండు భారీ సినిమాల మధ్య పోటీగా వస్తున్న ఈమూవీ కంటెంట్ రీత్యా అందరికీ కనెక్ట్ అయితే మహేష్ బన్నీలకు ఊహించని షాక్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: