సినిమా ఇండస్ట్రీలో బహిరంగంగా కుల ప్రభావం కనిపించకపోయినా అంతర్లీనంగా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో కుల ప్రభావం కనిపిస్తూ ఇండస్ట్రీని శాసిస్తూనే ఉంది. కళాకారులకు కళలకు కులం లేదంటూనే ఒక ప్రముఖ సామాజిక వర్గం కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఎలుతూనే ఉంది.

ఇలాంటి పరిస్థితులలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రభాస్ ‘సాహో’ ను ప్రశంసిస్తూ కులం కార్డును బయటపెట్టి ప్రభాస్ ను ఇరుకున పెట్టే కామెంట్స్ చేసాడు. ఈనెల 30న విడుదల కాబోతున్న ‘సాహో’ ను ఎప్పుడెప్పుడు చూడాలా అంటూ పరితపించిపోతున్నానని దీనికి కారణం తనది ప్రభాస్ ది ఒకే కులం అంటూ షాకింగ్ కామెంట్స్ పెట్టాడు. 

అంతేకాదు తనకు కుల పిచ్చి ఎక్కువ అని చెపుతూ ప్రభాస్ కు కుల పిచ్చి ఉన్నా లేకపోయినా తాను మాత్రం కుల పిచ్చితో రగిలి పోతున్నాను అంటూ సెటైర్లు వేసాడు. వర్మ చేసిన కామెంట్స్ సరదాగా అనిపించినా ప్రస్తుతం ఇండస్ట్రీ ఎలా కులాల పేరుతో విడిపోయిందో అర్ధం అవుతుంది. 

ఇదే సందర్భంలో వర్మ మరొక ట్విస్ట్ ఇస్తూ తన లేటెస్ట్ మూవీ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ లోని ఒక పాటను 27వ తారీఖు ఉదయం 9.27 నిమిషాలకు బ్రహ్మ ముహూర్తంలో రిలీజ్ చేయబోతున్నాం అంటూ ప్రకటన కూడ ఇచ్చాడు. వర్మకు తన సినిమాలకు సంబంధించి వెరైటీ పబ్లిసిటీ ఇవ్వడం అలవాటే అయినా ఏకంగా తన లేటెస్ట్ మూవీ వార్తలను షేర్ చేయడానికి ప్రభాస్ కు కులం రంగు పులుముతూ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రభాస్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి. తన అభిమానుల చేత డార్లింగ్ అంటూ కులాలకు అతీతంగా పిలిపించు కుంటున్న ప్రభాస్ కు వర్మ అంటకట్టిన ఈ కుల పిచ్చి ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: