కింగ్ నాగార్జున అతని కోడలు సమంత కు పడడం లేదా ?  తాజాగా అక్కినేని ఫ్యామిలీలో జ‌రుగుతున్న ప‌రిణామాలే ఇందుకు ఊత‌మిస్తున్నాయా ? అంటే అవున‌నే గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. నాగార్జున తీసుకునే నిర్ణ‌యాలు కోడుల స‌మంత‌కు న‌చ్చ‌డం లేద‌ట‌. పెళ్ల‌య్యాక కూడా స‌మంత త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా సినిమాలు చేసుకుంటూ పోతోంది. ఈ విష‌యంలో త‌న స్వేచ్ఛ త‌న‌దే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది.


పెళ్ల‌య్యాక కూడా ఆమె అక్కినేని ఫ్యాన్స్ ఇబ్బంది ప‌డేలా ఎక్స్‌పోజింగ్ చేసేలా హాట్ , టైట్ డ్రెస్సులు వేసుకుంటోంది. ఇదిలా ఉంటే నాగార్జున తాజాగా ఒక ఫ్రెంచ్‌ సినిమాకి రీమేక్‌ గా చేసిన మన్మథుడు 2 చేశాడు. ఈ సినిమా చాలా ఘోరంగా ప్లాప్ అయ్యింది. ఈ సినిమా చేయొద్దు అని సామ్ పదేపదే నాగ్ అండ్ చైతులకు చెప్పిందట. కానీ నాగ్ అవి ఏమి పట్టించుకోకుండా సినిమా చేసేయడంతో సామ్ ఫీల్ అయిందట. 


అంతే కాకుండా ఈ సినిమాలో క్రేజ్ కోసం సామ్‌తో నాగ్ ఏ మాత్రం ప్రాధాన్యం లేని ఓ పాత్ర బ‌ల‌వంతంగా చేయించాడు. అది కూడా ఆమెకు న‌చ్చ‌లేదంటున్నారు. అలాగే మరోపక్క కోడ‌లు బ‌ల‌వంతంతోనే చైతన్య బంగార్రాజు ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేసి శేఖర్‌ కమ్ముల సినిమా చేస్తున్నాడనే రూమర్‌ కూడా వుంది. ప్ర‌స్తుతం బంగార్రాజు ప్రాజెక్ట్ షూటింగ్ జ‌ర‌గ‌డం లేద‌న్న సంగ‌తి తెలిసిందే.


నాగ్ ముందుగా బంగార్రాజు షూటింగ్ త్వరగా స్టార్ట్ చేసి సంక్రాంతి కి రిలీజ్ చేయాలనీ చూస్తే సామ్ ప్లాన్‌తో అది వెన‌క్కి వెళ్లి శేఖ‌ర్ క‌మ్ముల సినిమా ముందుకు వ‌చ్చింది. ఇలా చైతు చేసే ప్రతి సినిమా విషయంలో సామ్ హ్యాండ్ ఉండడంతో నాగార్జున గుస్సా అవుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.  


అంతే కాకుండా వీరిద్ద‌రు సొంత బ్యాన‌ర్లో కాకుండా బ‌య‌ట బ్యాన‌ర్లో సినిమాలు చేసేందుకే ప్ర‌యార్టీ ఇవ్వ‌డం కూడా నాగార్జున‌కు న‌చ్చ‌లేదంటున్నారు. ఈ వార్త‌ల్లో నిజానిజాలేమోగాని ఇవి ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: