ఆగష్టు 15 వ తేదీన ఎర్రకోటపై మోడీ చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది.  మోడీ ప్రసంగంలో అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.  అందులో ఒకటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం.  సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే పర్యావరణాన్ని రక్షించినట్టు అవుతుంది.  భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని కల్పించే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.  యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ కారణంగా పర్యావరణం పాడైపోతుందని, మహాత్మా గాంధీ 150 వ జయంతి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై పోరాటం చేయాలని మోడీ పిలుపును ఇచ్చాడు.  


మోడీ ఇచ్చిన ఈ పిలుపు ఎందరినో ఆకర్షించింది.  చాలా మంది మోడీపిలుపుకు స్పందించారు.  సెలెబ్రిటీలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు స్వస్తి పలికేందుకు సిద్ధం అవుతున్నారు.  చాలామంది ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.  వీలైనంత త్వరగా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవడానికి ప్రజలు కూడా రెడీ అవుతున్నారు.  అటు ప్రభుత్వం కూడా కొన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటోంది.  


ప్లాస్టిక్ ప్లేస్ లో పేపర్ లేదా మట్టితో తయారు చేసిన వస్తువులను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మమ్మురం చేసింది.  రైల్వే, బస్సు, ఎయిర్ పోర్ట్ లలో ప్లాస్టిక్ ప్లేస్ లో మట్టి కాపులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది.  ఇప్పటికే వారణాసి, బరేలిలో ఈ విధానం అమలులో ఉన్నది.  దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయడానికి రెడీ అవుతున్నది ప్రభుత్వం.  మోడీ పిలుపుకు బాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరిగా మద్దతు తెలుపుతున్నారు.  


వీరిలో అమీర్ ఖాన్ ఒకరు.  మోడీ ఇచ్చిన పిలుపు బాగుందని, ప్రతి ఒక్కరు తమ ప్రాధమిక హక్కుగా భావించి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలని అన్నారు.  ఇకపై తాను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడనని స్పష్టం చేశారు.  భారతీయ పౌరుడిగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమిర్ ఖాన్ పేర్కొన్నారు.  భారతీయులుగా ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ ను నిషేదించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన భూమికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించాలని అమిర్ ఖాన్ పేర్కొన్నారు.  ప్రతి ఒక్కరు దీన్ని ఒక సొంత పనిగా భావించాలని ఆయన చెప్పడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: