మరో మూడు రోజుల్లో విడుదల కాబోతుంది ప్రభాస్, శ్రధ్ధా కపూర్ జంటగా నటించిన సాహో సినిమా. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 10 వేల థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది. బాహుబలి, బాహుబలి 2 సినిమాల తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావటం, ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. 
 
ఈ సినిమాపై ప్రముఖ నిర్మాత నట్టికుమార్ నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. సాహో సినిమాకు 100 రుపాయలకు మించి టికెట్ ధరను వసూలు చేయకూడదని థియేటర్ యాజమాన్యాలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ పిటిషన్ దాఖలైంది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి, శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ అధినేత దిల్ రాజు ఇద్దరినీ ప్రతివాదులుగా చేర్చినట్లు తెలుస్తుంది. 
 
ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ మొదలుకాగా వీకెండ్ వరకు టికెట్లు అన్నీ అమ్ముడయినట్లు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఈ సినిమా 100 కోట్ల రుపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించబోతున్నాడని తెలుస్తుంది. ఒక పాత్రలో ప్రభాస్ అండర్ కవర్ కాప్ గా కనిపిస్తుండగా మరో పాత్ర వివరాలు తెలియాల్సి ఉంది. 
 
ఈ సినిమా తరువాత ప్రభాస్ యువి క్రియేషన్స్ నిర్మాతలుగా రాధాకృష్ణ దర్శకత్వంలో నటించబోతున్నాడు.ఈ సినిమాకు జాన్ అనే టైటేల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 25 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారని కానీ సాహో అంత భారీ బడ్జెట్ సినిమా ఐతే కాదని ప్రభాస్ మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: