బాహుబలి బ్రహ్మ జక్కన్న అంటే తెలియని వారు ఉండరేమో.. అంతగా ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి గారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఈయన మాటే వేదం.. ఈయన మాటే శాసనం అంటున్నారు మిగిలిన సినీ ప్రముఖులు. నిజానికి రాజమౌళి గారి మనస్త్వం ఎలాంటిదంటే నిదానమే ప్రదానం అని నమ్మే వ్యక్తి.. అందుకే కాబోలు ప్రపంచస్థాయి రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర పుటల్లో నిలిచాడు. సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకున్నాడు. దర్శకుల్లో రారాజు అని చెరగని ముద్ర వేసుకున్నాడు కూడా.. 

విషయానికొస్తే.. బాహుబలి తర్వాత జక్కన్న మరో సారి భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్నారు. ఆ సినిమా కూడా బాహుబలి రేంజు రావాలని కూసంత టైం గ్యాప్ తో రూపొందిస్తున్నారు. ఆ సినిమాను మల్టీస్టారర్ కథనంతో తెరెకెక్కిస్తున్నారు. ఆ సినిమాకోసం ఈ సారి ఏకంగా బాగా పాపులారిటీ ఉన్న తెలుగులోని టాప్ హీరోలతో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. అయితే, తెలుగులో యంగ్ అండ్ డైనమిక్ స్టార్ హీరో అంటే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లను ఎంచుకున్నాడు జక్కన. టాలీవుడ్ లో దూకుడుగా వ్యవహరిస్తున్న వీరిద్దరితో సినిమా చేస్తే, అంతే దూకుడుతో కలెక్షన్లను కోళ్ల గొట్టాలనుకున్న రాజమౌళి ఎట్టకేలకు వీరిద్దరితో సినిమాను ప్రారంభించారు.

ఆ సినిమాకు ఆర్ ఆర్ ఆర్  అనే టైటిల్ ను ఖారారు చేశారు. అయితే, ఈ చిత్ర షూటింగ్ ను పూజ కార్యక్రమాలతో అతిరధుల మహారతులా మధ్య ప్రారంభించారు జక్కన్న. షూటింగ్ ఏమని ప్రారంభించారో గాని అప్పటి నుండి ఈ సినిమాలో అనుకోకుండా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. షూటింగ్ మొదలైనప్పటి నుండి హీరోలిద్దరికి గాయాలు తగిలాయి. దానితో షూటింగ్ పనులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. ఎందుకైనా మంచింది కొంచం గ్యాప్ తీసుకున్న పర్వాలేదనుకున్న జక్కన్న ఇద్దరికి పూర్తిగా నయం అయ్యాకే సినిమాను రీ షూట్ చేస్తున్నారు. 

ఆగస్టు 15 న చాలా సినిమాల పోస్టర్లు, టీజర్లు, సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఎన్టీఆర్ , చెర్రీ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా నుంచి ఏదోకటి రిలీజ్ అవుతుందని ఆసక్తిగా ఎదురు చూసారు కానీ, జక్కన్న వాళ్లకు నిరాశే మిగిలిచారు. ఇకపోతే శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి . ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను అక్టోబర్ 22 న రిలీజ్ చేస్తామని ఆ చిత్ర యూనిట్ వెల్లడించింది. వచ్చే ఏడాదికి జులై నెల చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తారట. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు అలియాభట్, అజయ్ దేవగణ్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా లో ఇంకో హీరోయిన్ ఎవరా అనేది ఇంకా తెలియడం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: