యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ సినిమా రంగంలోకి అడుగుపెట్టి అనేక సంచలన సినిమాలు చేశాడు.  ఇప్పటికే ఇంకా హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.  తాజాగా ఈ హీరో చేసిన కల్కి సినిమా బాగానే ఆడింది.  ఇదిలా ఉంటె, ఇప్పుడు ఈ హీరో కూతుర్లు శివాని, శివాత్మికలు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.  ఇద్దరు బెస్ట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.  


ఇదిలా ఉంటె, రాజశేఖర్ పెద్దమ్మాయి శివాని ముందుగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతుందని అనుకున్నారు.  కానీ, చెల్లెలు దొరసాని సినిమాతో ముందుగా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.  అదే ఊపుతో రెండో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యింది.  అయితే, పెద్దమ్మాయి శివాని నటించిన 2 స్టేట్స్ సినిమా మధ్యలో ఆగిపోవడంతో పాపం చిక్కుల్లో పడింది.  


మొదటి సినిమా రిలీజ్ అయ్యేలోపు తనను తాను ఫేమ్ చేసుకోవాలని చెప్పి ఫోటో షూట్ చేయడం చేయడం మొదలు పెట్టింది.  ఈ అమ్మడు తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది.  టాలీవుడ్ లో మాములుగా హీరోల కూతుర్లు ఇండస్ట్రీలో గ్లామర్ రోల్స్ చేసేందుకు ఆసక్తి చూపించరు.  కానీ, శివాని మాత్రం అందుకు విరుద్ధంగా ఫోటో షూట్ చేసింది.  


గ్లామర్ గా ఫోజులు ఇస్తూ.. స్లీవ్ డ్రెస్ తో...అంగాంగ ప్రదర్శన చేస్తూ ఫోటోలు దిగింది.  వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.  అసలు ఎవరు ఈ అమ్మాయి.. రాజశేఖర్ కూతురా లేకుంటే.. ముంబై మోడలా అని అంటున్నారు. ఈ ఫోటోల తరువాత ఆమెపై శివానికి ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి.  ఇక ఈ ఫోటోలకు కామెంట్స్ కూడా అదే రీతిలో వస్తున్నాయి.  ఈ ఫోటోలు చూసిన తరువాతైనా ఈ అమ్మడుకి అవకాశాలు రావాలని కోరుకుందాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: