‘సాహో’ విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆ మూవీ పై జరుగుతున్న పాజిటివ్ నెగిటివ్ ప్రచారాలు ఒకదాని పై మరొకటి పోటీ పడుతూ ఈ మూవీ బయ్యర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ హిందీ వెర్షన్ కు సంబంధించి అత్యుత్సాహంతో ప్రభాస్ తీసుకున్న నిర్ణయం ‘సాహో విజయానికి ఉత్తరాది ప్రాంతాలలో శాపంగా మారుతుందా అంటూ ఇప్పటికే ఈ మూవీ హిందీ వెర్షన్ ను చూసినవారు కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. 

ఈ మూవీ కోసం ప్రభాస్ చాల కష్టపడి హిందీ నేర్చుకుని డైలాగ్స్ చెప్పినా ఆ హిందీ స్లాంగ్ ఉత్తరాది ప్రేక్షకులకు మెప్పించే స్థాయిలో లేదనీ అది అంతా హైదరాబాద్ హిందీ స్లాంగ్ లో వచ్చిందనీ అంటున్నారు. వాస్తవానికి ఈ సమస్యను ముందుగానే ఊహించిన దర్శకుడు సుజిత్ ప్రభాస్ పాత్రకు హిందీ వెర్షన్ లో వేరే వారి చేత డబ్బింగ్ చెప్పిద్దామని ఎన్నిసార్లు అడిగినా ప్రభాస్ పట్టించుకోకుండా అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల ఈ సమస్య ఏర్పడింది అని అంటున్నారు.

దక్షిణాది నుండి హిందీ సినిమా రంగానికి వెళ్ళి టాప్ హీరోలుగా రాణించిన రజినీకాంత్ కమలహాసన్ లు తమకు హిందీ బాగా వచ్చినా చేయనిసాహసం ప్రభాస్ చేయడం రికార్డు పరంగా బాగున్నా ఈ మూవీ హిందీ వెర్షన్ క్వాలిటీ తగ్గిస్తుంది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘సాహో’ సినిమాలో  యాక్షన్ సీన్స్ గ్రాఫిక్స్ తో పాటు కొన్ని సెంటిమెంట్ సీన్స్ కూడ ఉన్న నేపధ్యంలో అలాంటి చోట్ల ప్రభాస్ వాయస్ తేలిపోయింది అని అంటున్నారు. 

ముఖ్యంగా ఇలాంటి భారీ సినిమాలలో దక్షిణాది నటులు నటించేడప్పుడు ఎక్కడ పొరపాటు దొరుకుతుందా అన్న ఉద్దేశ్యంతో బాలీవుడ్ మీడియా చూస్తుంది కాబట్టి ప్రభాస్ తన పాత్రకు తాను డబ్బింగ్ చెప్పుకోకుండా రజినీకాంత్ కు గతంలో డబ్బింగ్ అందించిన మయూర్ వ్యాస్ చేత డబ్బింగ్ చెప్పించి ఉంటే బాగుండేది అన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ‘సాహో’ లాంటి భారీ సినిమాకు లాభాలు రావాలి అంటే ఈమూవీ బాలీవుడ్ లో కూడ సూపర్ హిట్ అవ్వవలసిన పరిస్థితులలో ప్రభాస్ అనవసరమైన ప్రయోగాల వైపు అడుగులు వేసాడు అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: