నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'జై సింహ' సినిమాకు హిందీ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.  బాలకృష్ణ -కెఎస్ రవి కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది సంక్రాంతి సీజన్ లో  విడుదలై  మంచి వసూళ్ల ను రాబట్టి హిట్ అనిపించుకుంది.  ఇక ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ ను  రీసెంట్ గా  వారం క్రితం అదే టైటిల్ తో యూ ట్యూబ్ లో  విడుదల చేశారు. 



అలా విడుదలయ్యిందో లేదో ఈ చిత్రం ఇప్పటికే 19 మిలియన్ల వ్యూస్ ను రాబట్టుకుంది. ఇక ఈ సినిమా కు హిందీ ప్రేక్షకులు ఎంతలా  కనెక్ట్ అయ్యారో  కామెంట్స్ చూస్తేనే అర్ధం అవుతుంది.  దాదాపుగా కామెంట్స్ అన్ని పాజిటివ్ గానే వస్తున్నాయి.  గత కొంత కాలంగా తెలుగు డబ్బింగ్ సినిమాలు నార్త్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో బాలయ్య ,జై సింహ కూడా చేరింది. 



ఇక జై సింహ హిట్ కావడంతో  ప్రస్తుతం బాలకృష్ణ ,కె ఎస్ రవికుమార్ తో రెండో సారి సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమాకు 'రూలర్' అనే టైటిల్ ప్రచారంలో వుంది.  ఇటీవలే  ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్  థాయిలాండ్ లో  ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో  యాక్షన్ సన్నివేశాలను  తెరకెక్కిస్తున్నారు.   హై  వోల్టేజ్ యాక్షన్  ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న  ఈ చిత్రంలో బాలయ్య కు జోడిగా  సోనాల్ చౌహన్ , వేదిక నటిస్తుండగా. సీనియర్ నటి  భూమిక  చావ్లా  ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందట. సీకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఫై సి కళ్యాణ్ నిర్మిస్తున్న  ఈ చిత్రాన్ని  వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: