సాధారణంగా టాప్ హీరోల సినిమాల మధ్య పోటీ నడుస్తూ ఒకేరోజు ఇద్దరు టాప్ హీరోల సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే దీనికి భిన్నంగా ఈ వారంలో ఇద్దరు టాప్ హీరోల షష్టిపూర్తి జరగడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

వెండితెర మన్మధుడుగా గత మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో టాప్ హీరో ఇమేజ్ కొనసాగిస్తున్న నాగార్జున 60వ పుట్టినరోజు ఆగస్టు 29న జరగబోతోంది. ఇప్పటికే తన కుటుంబ సభ్యులు తన చిన్ననాటి స్నేహితులతో స్పెయిన్ చేరుకున్న నాగ్ అక్కడ తన షష్టిపూర్తి వేడుకలను జరుపుకొబోతున్నాడు.  ఇక నాగార్జున తో సమానంగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి నాలుగు దశాబ్దాల కాలంగా ఇండస్ట్రీలో హీరోగా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న సుమన్ షష్టిపూర్తి కూడ ఈరోజు జరగుతోంది. 

దీని సందర్భంగా సుమన్ సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్ లో ఒక సమావేశాన్ని నిర్వహించి తన షష్ఠిపూర్తి బ్రోచర్ ని ఈ సందర్భంగా ఆవిష్కరించాడు. సుమన్ పుట్టి పెరిగింది కర్ణాటక లోని మంగుళూరు ప్రాంతం అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులలో అతడు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు. హీరోగా వరస విజయాలు సుమన్ సినిమాలకు వస్తున్న అప్పటి పరిస్థితులలో అతడు చిరంజీవికి సవాల్ విసిరే హీరోగా ఎదుగుతాడని చాలామంది భావించారు. 

అయితే ఒక కేసు సుమన్ జీవితాన్ని ఒక మలుపు తిప్పినా ఆత్మస్థైర్యంతో పరిస్థితులు ఎదిరించి ఇప్పటికీ ఒక ప్రముఖ నటుడుగా సుమన్ తన కెరియర్ కొనసాగిస్తున్నాడు. మాస్ హీరోగా నాగార్జున రాణించ లేకపోయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చే అనేక పాత్రలలో నటించడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలను అత్యంత విజయవంతంగా హోస్ట్ చేసే స్థాయిలో కొనసాగుతున్న నాగ్ తాను జీవించి ఉన్నంతకాలం సినిమాలలో నటిస్తూనే ఉంటాను అంటూ ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దీనితో ఈ వారంలో షష్టిపూర్తి జరుపుకుంటున్న ఈ ఇద్దరి టాప్ హీరోల కెరియర్ మరింత ఉన్నతంగా రాబోతున్న రోజులలో కొనసాగాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: