రాజమోళి టాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్ లో ఒకరు.  ఇప్పటి వరకు ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో ఏ ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు.  ఓటమి ఎరుగని ధీరుడు అని చెప్పొచ్చు.  అందుకే ఆయనకు అంతటి క్రేజ్ ఉన్నది.  రాజమౌళి ఒక సినిమాను స్టార్ట్ చేశారంటే దానిని పూర్తి చేసే వరకు దాని గురించే ఆలోచిస్తారు తప్పించి మరో దానిపైకి ఆలోచన వెళ్లదు.  అలాంటి ఆలోచనలు కూడా ఆయన మదిలోకి రానివ్వడు.  అందుకోసం రాజమౌళి సినిమాలు హిట్ అవుతుంటాయి.  


పైగా ఆడియన్స్ నాడి బాగా తెలిసిన వ్యక్తి కావడంతో దేన్నీ ఎక్కడ ఎలా తీయాలో ఆయనకు బాగా తెలుసు.  ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా కథను రెడీ చేయడం దగ్గరి నుంచి షూటింగ్ వరకు అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది.  ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ చేస్తున్నారు.  కొమరం భీం గా ఎన్టీఆర్, సీతారామ రాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు.  ఈ సంగతి అందరికి తెలిసిందే.  


అయితే, చరిత్రలో కొమరం భీం, అల్లూరి సీతారామ రాజు ఇద్దరు కలిసినట్టుగా ఎక్కడా లేదు.  ఈ సినిమాలో ఇద్దరు కలిసినట్టుగా చూపిస్తున్నారు.. ఇద్దరు కలిసి బ్రిటిష్ దొరలపై ఎలా పోరాటం చేశారో ఇందులో చూపించబోతున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బల్గెరియా అడవుల్లో జరుగుతున్నది. ఆ అడవుల్లో కొమరం బీమ్ కు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.  హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లు ఈ సీన్స్ ను కంపోజ్ చేస్తున్నారు. 


ఇదిలా ఉంటె, బల్గెరియా అడవుల్లో రాజమౌళి ఓ చెట్టుకింద కుర్చీలో కూర్చొని చేతిలో ఓ చిన్న కర్ర పట్టుకొని సీరియస్ గా ఆలోచిస్తున్నాడు. నెక్స్ట్ తీయబోయే సీన్ గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నాడు రాజమౌళి.  దానికి సంబంధించిన ఫోటో ఒకరి సోషల్ మీడియాలో షేర్ అయ్యింది.  సోషల్ మాధ్యమాల్లో జోరుగా పరుగులు తీస్తోంది.  ఈ ఫోటోపై అనేక కామెంట్లు కూడా వస్తున్నాయి.  రాజమౌళి కొమరం భీం గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నారని, కొమరం భీం వావ్ అనిపించేలా షూట్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: