నందమూరి బాలకృష్ణ సినిమాలు ఎలా ఉంటాయో తెలిసిందే.  ఒకప్పుడు వరుసగా హిట్స్ ఇచ్చేవాడు.  ఇటీవల కాలంలో హిట్ పెర్సెంటేజ్ తగ్గిపోయింది.  మంచి కథలు దొరక్కపోవడం కావొచ్చు.. లేదంటే మరేదైనా కారణం కావొచ్చు.  మంచి కథ కథనాలు, దాన్ని అద్భుతంగా తీయగలిగే సత్తా ఉన్న దర్శకుడు దొరికితే సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది.  అందులో సందేహం అవసరం లేదు.  


ఇక ఇదిలా ఉంటె, సినిమా తనను బాగా ఇన్స్పైర్ చేస్తే.. దానిలోకి పరకాయ ప్రవేశం చేసి షూటింగ్ లో పాల్గొంటాడు.  గతంలో చాలా సినిమాలు అలా ఆయన్ను ఇన్స్పైర్ చేశాయి అందుకే ఎన్నో హిట్స్ కొట్టాడు.  కానీ, ఇప్పుడు అలాంటి కథలు దొరకడం లేదు.  దొరికినా దాన్ని తీసే దర్శకులు దొరకడం లేదు.  స్పష్టంగా చెప్పాలి అంటే బాలకృష్ణలో ఉన్న టాలెంట్ ను వాడుకునే దర్శకులు కరువయ్యారు.  


బాలకృష్ణ సినిమాల గురించి చెప్పాలి అంటే .. ఉదాహరణకు రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా గురించి చెప్పుకోవచ్చు.  ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్.  ఇందులో బాలయ్య ఇన్స్పెక్టర్ గా నటించాడు.  నటించాడు అనే కంటే.. జీవించాడు అని చెప్పొచ్చు. మాములుగా సినిమా షూటింగ్ కు వచ్చిన తరువాత మేకప్ వేసుకుంటారు.. ఆ సీన్స్ తగిన డ్రెస్ లను వేసుకుంటారు.  


కానీ బాలయ్య ఈ సినిమా కోసం చాలా అడ్వాన్స్ గా ఉన్నారు.  సినిమా షూటింగ్ కు ఇంటిదగ్గర నుంచి వచ్చే సమయంలోనే మేకప్ వేసుకొని వచ్చేవారట.  పోలీస్ డ్రెస్ వేసుకొని అదే జీప్ లో సెట్స్ రావడంతో ఆ పాత్రలో బాగా ఇన్వాల్వ్ అయ్యేవారని దర్శకుడు చెప్పారు.  అలా పాత్రలో లీనం కావడం వలన సినిమా అద్భుతంగా వచ్చిందని.. సినిమా హిట్ అయ్యిందని దర్శకుడు బి గోపాల్ పలుమార్లు పేర్కొన్న సంగతి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: