పాపులర్  టీవీ రియాల్టీ షో బిగ్ బాస్  తెలుగు సీజన్ 3 లో  వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా  బిగ్ బాస్ హౌస్ లోకి  తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ ఎంట్రీ ఇవ్వనుందని గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.  ఇక ఈ వార్తలపై తాజాగా ఈషా క్లారిటీ ఇచ్చింది.  అసలు ఆ రూమర్స్ ఎలా వచ్చాయో నాకుఅర్ధం కావడం లేదు. చాలా మంది  ఫ్రెండ్స్ నా కు మెసేజ్ చేశారు  నువ్వు బిగ్ బాస్ లోకి వెళ్తున్నా అని ? నేను బిగ్ బాస్ లోకి వెళ్లనున్నట్లు వచ్చిన  వార్తలను  చూసి  నవ్వుకున్నాను..  అసలు బిగ్ బాస్  నిర్వాహకులు ఇంతవరకు తనను సంప్రదించలేదని..  వైల్డ్ కార్డ్ ద్వారా  నేను ఎంట్రీ ఇస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని  ఈషా తెలిపింది.  అలాగే ఒకవేళ స్టార్ మా యాజమాన్యం  నన్ను బిగ్ బాస్ లో భాగస్వామినీ చేయాలనుకుంటే  కంటెస్టెంట్ గా వేళ్లను కానీ  హోస్ట్ గా అయితే  ఓకే నని తన మనసులోని కోరికను  బయటపెట్టింది ఈషా రెబ్బ. 




ఇక ప్రస్తుతం జరుగుతున్న  బిగ్ బాస్ సీజన్ 3 తెలుగులో  మొదటి  వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చింది. అయితే తన వింత ప్రవర్తనతో  నామినేషన్ లో నిలిచి  అతి తక్కువ ఓట్ల తో వారం రోజులకే  హౌస్ నుండి  బయటికి వెళ్ళిపోయింది.  ఇక  ఇప్పుడు హౌస్ లోకి  రెండవ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా  మరొకరిని  ప్రవేశపెట్టడానికి  సిద్ధమవుతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.  మరి ఇంతకీ ఆ సెలబ్రెటీ ఎవరో తెలియాలంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: