తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ షో అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతుంది. ఇప్పటికి ఐదు వరాలు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో విజయవంతంగా ఆరవ వారంలోకి ప్రవేశించింది. బిగ్‌బాస్‌లో వారం వారం ఎవ‌రో ఒక‌రు ఎలిమినేట్ అవ్వాల్సిందే. ఐదు వారాల‌కు గాను మొత్తం ఐదుగురు బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు షోలో ట్రాన్స్‌జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రితో క‌లిసి 16మంది ఎంట్రీ ఇవ్వ‌గా వీరిలో ఈ వారంలో ఏలిమినేట్ అయిన ఆషురెడ్డి తో కలిపి మొత్తం షో నుండి ఇప్పటికీ ఐదుగురు బయటకు వెళ్లడం జరిగింది. 


ఇక ఈ వారం కొరకు హిమజ, మహేష్, పునర్నవి, రవికృష్ణ, రాహుల్, వరుణ్ సందేష్ మొత్తం ఆరుగురు సభ్యులు నామినేట్ కావడం జరిగింది. దీనితో ఈ వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా మారింది. అయితే బిగ్‌బాస్ స‌డెన్‌గా షాక్ ఇస్తూ ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఉన్న ఈ ఆరుగురిలో ముగ్గురికి మాత్ర‌మే ఆ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో నెగ్గిన వారు ఈ వారం ఎలిమినేష‌న్ నుంచి సేఫ్ అవుతార‌ని కూడా చెప్పాడు.


ఈ సీక్రెట్ టాస్క్‌లో హీరో వ‌రుణ్ సందేశ్‌, ర‌వితో పాటు సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ ఆ టాస్క్‌ను విజ‌య‌వంతంగా కంప్లీట్ చేసుకుని ఈ వారం ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలిన వారిలో హిమ‌జ‌, పునర్నవి, మహేష్ విట్టాలకే ఎలిమినేషన్ ప్రమాదం పొంచివుంది. వీళ్లు ముగ్గురు మాత్ర‌మే ఈ వారం ఎలిమినేష‌న్లో ఉన్నారు. మ‌రి వీరిలో ఎవ‌రు ఉంటారో ?  ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ‌తార‌న్న‌ది మాత్రం స‌స్పెన్స్‌.


అయితే బ‌య‌ట ఫ్యాన్స్ ప‌రంగా ఫాలోయింగ్ చూసుకుంటే పున‌ర్న‌వి, హిమ‌జ ఎక్కువ మందికి తెలుసు. మ‌హేష్ విట్టా క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు చెందిన కామ‌న్ మ్యాన్‌. ఇక మ‌హేష్‌ను ప‌క్క‌న పెడితే పున‌ర్న‌వి, హిమ‌జ‌ల‌లో హిమ‌జ కంటే పున‌ర్న‌వికే ఎక్కువ మంది ఓట్లు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: