బిగ్ బాస్ సీజన్ 3 ఈ మద్యే కొంచెం ఆసక్తిగా ముందుకుసాగిపోతుంది. ఇప్పటికే దాదాపుగా సగం షో పూర్తి కావోస్తుండటంతో కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ గేమ్ పై పూర్తిగా ఒక అవగాహనకి వచ్చారు. దీనితో ఎవరు కూడా తగ్గకుండా తమ ఫోర్ఫామెన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా టైటిల్ ఫెవరెట్ గా బరిలోకి దిగిన శ్రీముఖి ఐతే హౌస్లో ఒక రేంజ్ లో రెచ్చిపోతుంది. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నా ఆట తీరు ఇంతే అన్నట్టుగా బిగ్ బాస్ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే  ఐదుగురు హౌస్ మేట్స్ ఇంటి నుండి బయటకి వచ్చేసారు. 


ఇక ఈ వారం నామినేషన్స్ లో ముగ్గురు మాత్రమే ఉండటంతో ఎలిమిషన్స్ చాల ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక బిగ్ బాస్ ఈవారం చలో ఇండియా అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్ ని ఇచ్చాడు. ఇందులో రవి , పునర్నవి హనీమూన్ కి వచ్చిన కపుల్ గాను , శివజ్యోతి , వితిక తల్లీకూతుర్లు గాను , వరుణ్ అండ్ రాహుల్ ట్రైన్ డ్రైవర్ , కండక్టర్ గాను , శ్రీముఖి అందమైన అమ్మాయిగా , అలీ మేనేజర్ గా ఉన్నారు. బాబా వంట మాస్టర్ గా ఉన్నాడు. ఇక టాస్క్ లో భాగంగా ఇప్పటికే హౌస్ మేట్స్ రెండు ప్రదేశాలని చుట్టి వచ్చారు. శ్రీనగర్ , చండీఘడ్ ప్రదేశాలని చుట్టివచ్చారు. 


ఇందులో భాగంగా హౌస్ ఎంఎస్ అందరూ తమదైన రీతిలో ఫోర్ఫామ్ చేస్తూ అందరిని అలరించారు. అలాగే మధ్యలో మరో రెండు టాస్క్ లు కూడా ఇచ్చాడు. అందులో మొదటి టాస్క్ లో బాబా గెలవగా , రెండో టాస్క్ లో మహేష్ గెలిచాడు. ఇక తాజాగా వచ్చిన ప్రోమోని ఒకసారి చూస్తే... బిగ్ బాస్ ఇచ్చిన చలో ఇండియా లగ్జరీ బడ్జెట్ లో భాగంగా రెండో భాగాన్ని ప్రారంభించినట్టు అర్థమౌతుంది. ఇందులో భాగంగా ..ప్యాసింజర్స్ కి వంట మాస్టర్ గా ఉన్న బాబా భాస్కర్ హౌస్ మేట్స్ తో తనకి హైదరాబాద్ తో ఉన్న అనుభంధం గురించి చెప్తున్నట్టు కనిపిచింది.

బాబా భాస్కర్ హైదరాబాద్ గురించి చెప్తుంటే ... శ్రీముఖి ఐతే ఒక రేంజ్ లో  నవ్వుతుంది. బాబా భాస్కర్ మాట్లాడుతూ ... నమస్కారం నా పేరు క్యాంటిన్ చంద్రశేఖర్. నేను హైదరాబాద్ కి వచ్చాను , నేను ఇంతకుముందు 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ కి వచ్చాను ..అప్పుడు  కోడలుగా ఉన్నది..అంటూ చెప్తూ మధ్య లో వాటర్ అడుగుతూ తనదైన రీతిలో కామెడీ చేస్తున్నాడు. ఆ కొండకి మధ్య లో ఒక చెట్టు అని చెప్తుంటే ..మధ్యలో హిమజ ఇప్పుడు ఆ పెద్ద చెట్టు ఉందా కొట్టేసారు అంటూ కామెడీ చేయగానే ..బాబా మల్లి నేను ఫస్ట్ నుండి వస్తా అని చెప్తున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: