యువి క్రియేషన్స్ సినిమా రంగంలో నిర్మాతలుగా, డిస్ట్రిబ్యూటర్లుగా కొనసాగుతూ థియేటర్ల రంగంలో కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చాలా ఏరియాలలో థియేటర్లను కొనటం లేదా కొత్త థియేటర్ల నిర్మాణం చేస్తున్నారు యువిక్రియేషన్స్ నిర్మాతలు. ప్రస్తుతం యువి క్రియేషన్స్ నిర్మించిన అతి పెద్ద తెరతో కూడిన మల్టీప్లెక్స్ థియేటర్ ఈరోజు రామ్ చరణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. 
 
ఈ థియేటర్ ను నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో నిర్మించారు. ఈ థియేటర్ లో మొత్తం మూడు స్క్రీన్ లు ఉన్నాయని తెలుస్తోంది. దాదాపు 40 కోట్ల రుపాయలతో యువి క్రియేషన్స్ ఈ థియేటర్ ను నిర్మించారు. రేపటినుండి ఈ మల్టీప్లెక్స్ లో సాహో సినిమాను ప్రదర్శించనున్నారు. ఆసియా ఖండంలోనే ఇలాంటి థియేటర్లు కేవలం రెండు మాత్రమే ఉన్నాయి. 
 
54 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఒక స్క్రీన్ ను నిర్మించారు. ఒకే సమయంలో దాదాపు 656 మంది సినిమాను వీక్షించేలా ఈ థియేటర్ ను నిర్మించారు. వి ఎపిక్ మల్టీప్లెక్స్ పేరుతో ఈ థియేటర్ ను నిర్మించారు. మన దేశంలోనే అతి పెద్ద స్క్రీన్ ఇదే కావటం విశేషం. ఈ స్క్రీన్ తో పాటు 140 సీట్ల కెపాసిటీతో మరో రెండు స్క్రీన్ లు ఉన్నాయి. టికెట్ రేట్లు 200 రుపాయలు, 150 రుపాయలు ఉండబోతుందని తెలుస్తుంది. 
 
థియేటర్లలో ఎక్కడ నుండి చూసినా ఒకే వ్యూ ఉండేలా ఈ థియేటర్ ను నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ థియేటర్లో గేమింగ్ జోన్, షాపింగ్ అన్నీ ఒకేచోట ఉండేలా ఈ థియేటర్ ను నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ థియేటర్ వీడియో క్వాలిటీ పరంగా అద్భుతంగా ఉండబోతుందని, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ను ఉపయోగిస్తున్నారని సమాచారం. ఆసియా ఖండంలోనే వీ ఎపిక్ థియేటర్ మూడవ అతి పెద్ద థియేటర్ కావటం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: