తెలుగు సినిమా రంగంలో వెటరన్  హీరోలు అంటే వెంటనే చెప్పేసి అక్కినేని, నందమూరి అని, హీరోయిన్ల విషయానికి వస్తే సావిత్రి, జమున అంటారు. అంటే అలనాటి నటీనటుల ప్రతిభా పాటవాలకు ఈ నలుగుగు మచ్చుతునకలుగా చెప్పాలన్నమాట. ఇందులో ముగ్గురు ఇపుడు మన మధ్యన  లేరు. మనకు మిగిలిన ఒకే ఒక అలనాటి ఆణిముత్యం జమున. ఆమె జన్మదినం ఈ రోజు. ఆమె ఇప్పటికి కూడా ఎంతో చురుకుగా ఉంటూ తనదైన పాత్రను దైనందిన జీవితంలో పోషిస్తున్నారు.


జమున పుట్టిల్లు చిత్రం ద్వారా 1950 ప్రధమార్ధంలో చిత్ర సీమకు పరిచయం అయ్యారు. ఆమె నాటి హీరోలు అక్కినేని, నందమూరిలకు కరెక్ట్ పెయిర్ గా ఉండేవారు. రెబెల్ టైప్ క్యారక్టర్లు వేయాలంటే జమునేనని అంతా చాయిస్ గా చూసేవారు. ఇక లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ని తొలిసారిగా చేసింది. ఎక్కువగా చేసింది కూడా జమునే. ఆమె మీద  కధలు  రాసి సినిమాలుగా  నిలబడినవి ఎన్నో అప్పట్లో హిట్లు కొట్టాయి.


ఇక జమున పాత కొత్త హీరోలతో ఆ తరంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అగ్ర నటులుగా ఉన్న నందమూరి, అక్కినెనై ఆమెను కాదని వదిలేసినా తాను సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకుని మళ్ళీ వాళ్ళ పక్కన నటించిన ఘనత జమున సొంతం. ఆమె కేవలం సినిమాలకే పరిమితం కాలేదు.ప్రజా జీవితంలోనూ రాణించారు. రాజమండ్రీ నుంచి ఎంపీగా 1989 ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీకి మహిళా అధ్యక్షురాలిగా ఉంటూ నాటి టీడీపీ సర్కార్ మీద విమర్శల జల్లు కురిపించేవారు.



మహిళలకు రోల్ మోడల్ గా ఉండడమే కాదు. ముప్పయ్యేళ్ళ పాటు హీరోలతో సమానంగా సుదీర్ఘమైన హీరోయిన్ లైఫ్ ని ఆమె ఎంజాయ్ చేశారు. ఎంతో మందికి స్పూర్తిగా ఉంటూ ప్రజా జీవితంలోనూ మహిళల సమస్యల పట్ల స్పందించే బహుముఖీయమైన ప్రతిభా పాటవాలు కలిగిన జమునకు అవార్డుల విషయంలో అన్యాయమే జరిగిందని చెప్పాలి. అమెను ఇప్పటివరకూ ఒక్క పద్మశ్రీ పురస్కారం కూడా వరించలేదు. కారణం తెలియదు కానీ ఆమె తరువాత వచ్చిన వారికి ఆ అవార్డులు తగ్గాయి. ఇప్పటికైనా కేంద్ర సర్కార్  ఆమె లాంటి వెటరన్ యాక్టర్ ని తగిన రీతిన పద్మ పురస్కారంతో గౌరవించాలని అంతా కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: