ప్ర‌భాస్ సాహో భారీ అంచ‌నాల‌తో థియేట‌ర్ల‌లోకి దిగింది. సినిమా క‌థ ట్రైల‌ర్‌లోనే చెప్పేశారు. కోట్ల డబ్బు, చాలా మంది విలన్స్‌ వారి మధ్య ఆధిపత్యపోరు. ఈ యుద్ధంలో హీరో ఏం చేశాడు ? అన్న‌దే స్టోరీ. క‌థ గొప్ప‌గా లేక‌పోయినా ద‌ర్శ‌కుడు సుజిత్ త‌న స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో మాయ చేసేందుకు శ‌త‌విధాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ప్రతీ సీన్‌ ది బెస్ట్ అనే స్థాయిలో రూపొందించారు. సినిమా అంతా చాలా రిచ్‌గా ఉంది. అయితే సినిమాకు గ్రాండ్‌లుక్ తీసుకు రావ‌డంలో, రిచ్ విజువ‌ల్స్ ప‌రంగా, యాక్ష‌న్ ప‌రంగా మంచి మార్కులే ఉన్నా క‌థాప‌రంగా ఫ‌స్టాఫ్‌లో చెప్పుకునేందుకు ఏం లేదంటున్నారు.


ఫ‌స్టాఫ్ పాత్ర‌ల ప‌రిచ‌యం చేసేందుకు, హీరో - హీరోయిన్ల మ‌ధ్య రొమాంటిక్ ట్రాక్ న‌డిపేందుకే సుజిత్ కాస్త త‌డ‌బ‌డిన‌ట్టు అనిపించింది. సినిమాలో యాక్ష‌న్ మీద పెట్టిన కాన్‌సంట్రేష‌న్ మిగిలిన అంశాల మీద పెట్ట‌లేదు. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ కూడా రెగ్యులర్‌ సినిమాల స్టైల్‌లోనే ఉన్నా కాస్త ఊపు తెప్పించింది.  శ్రద్ధా కపూర్‌ క్యారెక్టర్‌ కూడా ఆశించిన స్థాయిలో లేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ లోపాలన్నింటినీ ప్రభాస్‌ తన స్టైలిష్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో కవర్ చేసిన మాట నిజం.


విల‌న్లు తెర‌నిండా ఉన్నా ఒక్క చుంకీ పాండేకు మాత్ర‌మే కాస్త త‌న స్టైలీష్ విల‌నిజం ప్ర‌ద‌ర్శించేందుకు స్కోప్ ద‌క్కింది. పాటలు, వాటి పిక్చరైజేషన్‌ అద్భుతంగా ఉన్నా కథనంలో స్పీడు బ్రేకర్లలా మారాయి. సినిమాలో సాగ‌దీత కూడా చాలా ఎక్కువుగా ఉంది. ఫ‌స్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ ఇంట్ర‌స్టింగ్‌గా ఉన్నా సినిమా మీద ముందు నుంచి ఉన్న అంచ‌నాలు మాత్రం అందుకోలేదు. 


సినిమాలో ఎమోష‌న్లు, కామెడీ, రొమాంటిక్ ట్రాక్‌ల‌లో ఏ ఒక్క‌టి పండ‌లేదు. ఇక గ్రాఫిక్స్‌ సినిమాకు మేజర్‌ డ్రా బ్యాక్‌గా చెపుతున్నారు.  ఓవరాల్‌గా సాహో విజువల్‌ గ్రాండియర్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో అలరించినా బలహీనమైన కథ,  కథనంలోని లోపాల కారణంగా అక్కడక్కడా కాస్త నిరాశపరుస్తుంది. సినిమాకు మ‌రి సూప‌రెహే అన్న టాక్ లేక‌పోయినా సెకండాఫ్ బాగుండ‌డంతో జ‌స్ట్ ఓకే అంటున్నారు. మ‌రి ఈ టాక్‌తో సాహో ఏ రేంజ్‌లో వ‌సూళ్లు సాధిస్తాడో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: